Home Latest News ఎన్నిక‌ల సంఘం తీరుపై సుప్రీం కోర్టు ఆగ్ర‌హం..!

ఎన్నిక‌ల సంఘం తీరుపై సుప్రీం కోర్టు ఆగ్ర‌హం..!

ప్ర‌ధాని మోడీ బ‌యోపిక్‌పై ఎన్నిక‌ల సంఘం నిషేధం విధించ‌డాన్ని సుప్రీం కోర్టు తప్పుబ‌ట్టింది. అయితే, అస‌లు సినిమాను చూడ‌కుండానే ఏక‌ప‌క్షంగా సినిమాపై నిషేధం విధించార‌ని సినిమా నిర్మాత సుప్రీం కోర్టులో పిటిష‌న్ వేసిన సంగ‌తి తెలిసిందే. నిర్మాత పిటిష‌న్‌ను ఈ రోజు సుప్రీం కోర్టు విచార‌ణ‌కు స్వీక‌రించింది.

సినిమాను చూడ‌కుండానే ఆ సినిమా ఓట‌ర్ల‌ను ప్ర‌భావితం చేస్తార‌ని ఎలా భావించారంటూ సుప్రీం కోర్టు ఈసీని ప్ర‌శ్నించింది. మోడీ బ‌యోపిక్ చిత్రాన్ని చూసి ఆ త‌రువాత నిర్ణ‌యం తీసుకోవాల‌ని ఎన్నిక‌ల సంఘానికి సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మోడీ బ‌యోపిక్‌కు సంబంధించిన పూర్తి స‌మాచారాన్ని త‌మ‌కు సోమ‌వారంలోగా అంద‌జేయాల‌ని సుప్రీం కోర్టు ఎన్నిక‌ల సంఘాన్ని ఆదేశించింది.

అలాగే ఎన్నిక‌ల ప్ర‌చారంలో రాజ‌కీయ నేత‌లు మ‌తాల‌ను అడ్డుపెట్టుకుని కామెంట్స్ చేస్తున్నా ఎన్నిక‌ల సంఘం ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేక‌పోతుంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్తనా నియ‌మావ‌ళిని ఉల్లంఘించినా చ‌ర్య‌లు ఎందుకు తీసుకోవ‌డం లేదని ప్ర‌శ్నించింది. అంతేకాకుండా రేప‌టిలోగా ఎన్నిక‌ల సంఘం ప్ర‌తినిధులు త‌మ ముందు హాజ‌రు కావాల‌ని చీఫ్ జ‌స్టిస్ నేతృత్వంలోని బెంచ్ ఈసీని ఆదేశించింది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad