Home Latest News ఉద‌యించే సూర్యుడ్ని.. జ‌గ‌న్ గెలుపును ఆప‌డం ఎవ‌రిత‌రం కాదు..!

ఉద‌యించే సూర్యుడ్ని.. జ‌గ‌న్ గెలుపును ఆప‌డం ఎవ‌రిత‌రం కాదు..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజ‌య‌వాడ ఎంపీ అభ్య‌ర్ధి పొట్లూరి వ‌ర‌ప్ర‌సాద్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇటీవలే నందిగామలో ప్రచారం పూర్తి చేసుకున్న పీవీపీ, తాజాగా విజయవాడ తూర్పు లో ప్రచారాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా, విజయవాడ తూర్పు శాసనసభ నియోజకవర్గం లో ఉన్న సమస్యలు దూరం కావాలంటే, క‌చ్చితంగా వైసీపీ అధికారంలోకి రావాలని, అందుకు ప్రతి ఒక్కరూ వైసీపీకి ఓటు వేయాలని ప్రజలను కోరారు.

అయితే, దేశంలో ప్రసిద్ధి చెందిన పార్లమెంటరీ నియోజకవర్గాల్లో విజయవాడ కూడా ఒకటి. ఈ స్థానం నుంచి స్వాతంత్య్ర సమరయోధురాలు సరోజినీ నాయుడు సోదరుడు, సుప్రసిద్ధ ఆంగ్ల కవి, కమ్యూనిస్టు అభిమాని హరీంద్రనాథ్ చటోపాధ్యాయ, ప్రముఖ సంఘసేవకురాలు, కొమర్రాజు అచ్చమాంబ, ప్రముఖ ఇంజనీరు, కేంద్రమంత్రి కేఎల్ రావు వంటి ఉద్దండులు ఇక్కడ నుంచి విజయం సాధించిన వారిలో ఉన్నారు. ఇటువంటి చారిత్రక నేపధ్యం ఉన్న నియోజకవర్గం నుండి, పొట్లూరి వరప్రసాద్ ఎంపి అభ్యర్ధిగా పోటీ చేయడంపై విజయవాడ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ లో పుట్టిపెరిగిన వ్యక్తి కావడం తో, సహజంగానే పివిపి కి మద్దతు, ఆదరణ లభిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో వైసీపీ అభ్య‌ర్ధి పొట్లూరి ఎన్నికల ప్రచారం లో చురుగ్గా పాల్గొంటున్నారు. స్థానిక ప్రజలతో కలిసి వారు పడుతున్న కష్టాలను,వారి సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. తాజాగా జరిగిన ఎన్నికల ప్రచారంలో రిక్షా తొక్కుతూ శ్రమైక జీవన సౌందర్యాన్ని అనుభూతి చెందానని, శ్రమ లేకుండా జీవనం లేదని, మానవజాతి జీవించి ఉండటానికి ప్రథమ ప్రక్రియ శ్రమ అని అన్నారు. శ్రమైక జీవన సౌందర్యం అని మహాకవి శ్రీశ్రీ అన్న మాటలు నాలో స్ఫూర్తిని నింపాయని, దాన్ని అనుసరించే నేను ఈ స్థాయికి చేరుకోగలిగానని అన్నారు. నత్త నడకన సాగుతున్న మౌలిక సదుపాయాలు ఫ్యాన్ స్పీడ్ లో సాగాలంటే వైసిపి అదికారంలోకి రావాలి అన్నారు. నత్త నడకన సాగుతున్న మౌలిక సదుపాయాలు ఫ్యాన్ స్పీడ్ లో సాగాలంటే వైసిపి అదికారంలోకి రావాలి అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

అదే విధంగా, తాజాగా జగన్ కు మద్దతుగా, సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆధ్వర్యం లో, బహుజన రాజకీయ జన చైతన్య యాత్ర పేరుతో బస్సు యాత్రను చేపట్టారు. బహుజనుల భవిష్యత్తు కోసం ఈ యాత్ర చేపట్టామని సంస్థ అధ్యక్షుడు గురునాదం తెలిపారు, అయితే ఈ యాత్రను పొట్లూరివర ప్రసాద్ ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ, దివంగ‌త ముఖ్య‌మంత్రి రాజశేఖర్ రెడ్డి హయాంలో బహుజనులను బాగా ఆదరించారని, ఇప్పుడు వారిని ప‌ట్టించుకునే వారు లేరని, వారి కష్టాలను తీర్చే నాయకులు లేరని పీవీపీ అన్నారు. ఇది మారాలంటే, అన్ని వర్గాల ప్రజలు సంతృప్తిగా ఉండాలంటే వైఎస్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి కావాల‌ని అన్నారు.

ఉదయించే సూర్యుడిని అరచేయి పెట్టి ఎలా ఆపలేమో అలానే వైఎస్ జగన్ ప్రభంజనాన్ని కూడా ఎవరు ఆపలేరని, ఏప్రిల్ 11న ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మరలా సంక్షేమ రాజ్యాన్ని తీసుకొచ్చేందుకు ప్రతి వైసీపీ కార్యకర్త నిరంతరం శ్రమించాలని కోరారు పీవీపీ.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad