Home Latest News ఈబీసీ రిజ‌ర్వేషన్ల‌ బిల్లు ఆమోదానికి ఆ ఒక్క‌టే పెండింగ్‌..!

ఈబీసీ రిజ‌ర్వేషన్ల‌ బిల్లు ఆమోదానికి ఆ ఒక్క‌టే పెండింగ్‌..!

అగ్ర‌వ‌ర్ణ పేద‌ల‌కు ప‌దిశాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పిస్తూ కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన 124వ రాజ్యాంగ స‌వ‌ర‌ణ బిల్లుకు లోక్‌స‌భ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుపై మంగ‌ళ‌వారం నాడు లోక్ స‌భ‌లో సుదీర్ఘ చ‌ర్చ జ‌రిగింది. రాజ్యాంగ స‌వ‌ర‌ణ బిల్లు కావ‌డంతో స్పీక‌ర్ సుమిత్రా మహాజ‌న్ డివిజ‌న్ ఓటింగ్‌ను త‌ప్ప‌నిస‌రి చేశారు

దీంతో ప్ర‌తిపాదించిన స‌వ‌ర‌ణ‌ల‌పై డివిజ‌న్ ప‌ద్ధ‌తిలో స్పీక‌ర్ ఓటింగ్ నిర్వ‌హించారు. రిజ‌ర్వేష‌న్ బిల్లుకు అనుకూలంగా 323 మంది, వ్య‌తిరేకంగా ముగ్గురు స‌భ్యులు ఓటు వేశారు. మూడింట రెండొంద‌ల‌కుపైగా మెజార్టీతో బిల్లు ఆమోదం పొందిన‌ట్లు స్పీక‌ర్ ప్ర‌క‌టించారు. బిల్లు ఆమోదం పొందిన త‌రువాత లోక్ స‌భ నిర‌వ‌ధిక వాయిదా ప‌డింది. లోక్‌స‌భ ఆమోదంతో ఈబీసీ రిజ‌ర్వేష‌న్ బిల్లు ఇవాళ రాజ్య‌స‌భ‌కు రానుంది.

ఈబీసీ రిజ‌ర్వేష‌న్‌లు 50 శాతం కోటా ప‌రిధిలోకి రావ‌ని కేంద్ర ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. 50 శాతం కోటాకు అద‌నంగా ఈబీసీల‌కు రిజ‌ర్వేష‌న్ క‌ల్పిస్తామ‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఈ బిల్లు ద్వారా, కులాలు మ‌తాల‌కు అతీతంగా ఈబీసీలంద‌రికీ రిజర్వేష‌న్లు అంద‌నున్నాయి.

రిజ‌ర్వేష‌న్‌ల‌కు అర్హ‌త‌, ధృవీక‌ర‌ణ‌లు రాష్ట్రాల ప‌రిధిలోనే ఉంటాయ‌ని కేంద్ర ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది.
రాజ్య‌స‌భ‌లో ఆమోదం పొందితే ఆ త‌రువాత రాష్ట్ర‌ప‌తి సంత‌కం కోసం పంపిస్తారు. అనంత‌రం రిజ‌ర్వేష‌న్‌లు అమ‌ల్లోకి వ‌స్తాయి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad