Home Latest News రైతుల‌కు బోన‌స్ ఇస్తున్న ఏకైక ప్ర‌భుత్వం టీఆర్ఎస్ : క‌ల్వ‌కుంట్ల క‌విత‌

రైతుల‌కు బోన‌స్ ఇస్తున్న ఏకైక ప్ర‌భుత్వం టీఆర్ఎస్ : క‌ల్వ‌కుంట్ల క‌విత‌

తెలంగాణలో ఆత్మగౌరవంతో కూడిన అభివృద్దిని టీఆర్ఎస్ అందిస్తుందని ఆ పార్టీ నిజామాబాద్ ఎంపీ
అభ్యర్ధి కవిత అన్నారు. ఇదే ఆత్మగౌరవ పాలనను జాతీయ స్థాయిలో తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఇక మన పథకాలను కేంద్రం ఇస్తున్నట్లుగా బీజేపీ ప్రచారం చేసుకుంటుందని తీవ్రంగా విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో అవమానం జరిగింది. కానీ ఇప్పుడు కేసీఆర్ ఆధ్వ‌ర్యంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. ఈసారి రాష్ట్రంలో జ‌ర‌గ‌నున్న‌ 16ఎంపీ స్థానాలకు 16 గెలిపించాలని ప్రజలను కోరారు కవిత.

కాగా, ఇటీవ‌ల ఓ ప్రముఖ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో క‌విత మాట్లాడుతూ.. తెలంగాణ నాయకుల ఆత్మగౌరవం ప్రతిఫలించాలంటే 16కు 16 మంది ఎంపీలను గెలిపించాలని ప్రజలను కోరారు. తెలంగాణ ప్రజలకు రోషం ఎక్కువ. ఆకలిగా ఉన్నా ఆత్మగౌరవం తో బతకాలనుకుంటారు. అందుకే పోరాడి రాష్ట్రాన్ని తెచ్చుకున్నామ‌న్నారు. అభివృద్దిలో కూడా ముందుకెళ్తున్నాం. దేశంలో కూడా మన తెలంగాణ ఆత్మగౌరవం గెలవాలంటే మన టీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తేనే సాధ్యమవుతుందన్నారు.

తాను ఏం చేశానో ప్ర‌జ‌ల‌కు తెలుసని… చేసిన పనిని చూపించి ఓటు అడ‌గ‌డం ఒక్క టీఆర్ఎస్ కు మాత్రమే సాధ్యమన్నారు. మిగతా పార్టీల నాయకులు గెలిచిన తర్వాత కనిపించకుండా పోతారు.. ఢిల్లీలోనో, హైదరాబాద్ లోనో కనిపిస్తారు. అప్పుడప్పుడు టీవీల్లో మెరుస్తారు. కానీ టీఆర్ఎస్ ఎంపీలు అనుక్షణం అయితే ప్రజల్లో ఉన్నారు. లేదంటే పార్లమెంట్ లో పోరాడారు. తెలంగాణ సమస్యల మీద అనుక్షణం టీఆర్ఎస్ నేతలు పోరాడారు. నేను కూడా మన జిల్లా సమస్యలు, రాష్ట్ర సమస్యల నుంచి జాతీయ అంశాలపై కూడా మాట్లాడిన సందర్భాలు మీరు చూశారు. నేను చెప్పుకోవడం కాదు మేం ఏం చేశామో మీరు చూశారు. ఇంకో అవకాశం ఇస్తే మెరుగైన ఫలితాలు చేసి చూపిస్తాం. టీఆర్ఎస్ చేతల పార్టీ అన్న సంగతి మీకు చెప్పక్కర్లేదన్నారు.

సంక్షేమంలో మనతో పోటీ పడే రాష్ట్రం దేశంలోనే లేదు. రైతులకు 24గంటల ఉచిత కరెంట్ ఎక్కడైనా ఇస్తున్నారా? కలలో కూడా సాధ్యం కాని పనిని కేసీఆర్ చేసి చూపించారు. ఎర్రజొన్న రైతులకు బోనస్ ఇచ్చేది టీఆర్ఎస్ పార్టీయే. కుల వృత్తులను ఆదుకుంటున్న ప్రభుత్వం కూడా కేసీఆర్ సర్కారే. ఇలాంటివి ఇంకెన్నో చేసి మీ సేవలో తరిస్తాం. మన ఎంపీలందరినీ గెలిపించాలని క‌విత కోరారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad