Home Latest News గాల్లోనే ఆగిన విమాన ఇంజిన్‌.. ఆపై..!

గాల్లోనే ఆగిన విమాన ఇంజిన్‌.. ఆపై..!

గాల్లో ఉన్నప్పుడే ఇండిగో ఎయిర్‌బస్‌ ఏ320 నియో విమానం ఇంజిన్‌ పని చేయకుండా పోవడం ఘటనపై పౌర విమాన మంత్రిత్వ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై వెంటనే విచారణ జరిపించాలని ఆదేశించింది. ప్రైట్‌ అండ్‌ విట్ని ఇంజిన్‌ దీనికి అమర్చడం జరిగింది.

జనవరి 3న ఈ ఘటన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చెన్నై నుంచి కోల్‌కతా వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంజిన్‌ పని చేయకపోవడం గుర్తించిన పైలెట్లు విమానాన్ని మ‌ళ్లీ చెన్నై విమానాశ్రయానికి తీసుకెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆ విమానాన్ని పక్కనపెట్టినట్టు తెలుస్తున్నది. గాల్లో ఉన్నప్పుడే ఇంజిన్‌లో పెద్ద పేలుడు సంభవించినట్టు సమాచారం.

కొన్ని సాంకేతిక కారణాలతో విమానాన్ని తిరిగి చెన్నైకి తీసుకెళ్లడం జరిగిందని ప్రయాణికులకు సిబ్బంది వివరించారు. మంగళవారం దీనిపై విచారణ జరుపుతున్నామని సివిల్‌ ఏవియేషన్‌ సెక్రెటరీ ఆర్‌ఎన్‌ చౌబే తెలిపారు. విమానం ఏయిర్‌బస్‌ తయారు చేయగా, అమెరికాలో తయారైన ప్రైట్‌ అండ్‌ విట్ని ఇంజిన్‌ను దీనికి అమర్చినట్టు తెలిపారు.

ఇంజిన్‌ బ్లేడులు కూడా ధ్వంసమైనట్టు తెలుస్తున్నది. ఏ320 విమానంలో మొదటి సారి సమస్య తలెత్తిందని, పొగ, భారీ వైబ్రేషన్‌, భారీ శబ్దాలు రావడం వంటివి జరిగాయి. పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టాకే సేవలు వినియోగించుకుంటామని ఇండిగో సిబ్బంది తెలిపారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad