Home Latest News తెలంగాణలో మోగనున్న బడి గంట..కానీ!

తెలంగాణలో మోగనున్న బడి గంట..కానీ!

Telangana Government Announces Academic Year

కరోనా వైరస్ కారణంగా మార్చి నెల నుండి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలులో ఉండటంతో విద్యార్ధులు ఇళ్లకే పరిమితం అయ్యారు. కాగా పరిస్థితి మరింత చేజారుతుండటంతో స్కూళ్లు, కాలేజీలు ఇప్పట్లో తెరిచే ప్రసక్తే లేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గట్టిగా చెబుతున్నాయి. అయితే విద్యార్ధులు ఈయేడు తమ విద్యాసంవత్సరం కోల్పోవాల్సిందేనా అనే ప్రశ్నకు మాత్రం ప్రభుత్వం నో అని చెబుతూ వస్తోంది.

దీనికి తగ్గట్లుగా ప్రణాళికను రూపొందించింది తెలంగాణ ప్రభుత్వం. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే విద్యా సంవత్సరం మొదలుకాగా, తెలంగాణలో మాత్రం ఇంకా కాలేదని పలువురు కేసీఆర్ సర్కార్‌పై మండిపడుతున్నారు. అయితే వారందరి నోళ్లు మూయించేందుకు తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఈయేడు విద్యా సంవత్సరాన్ని సెప్టెంబర్ 1 నుండి ప్రారంభిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. 1వ తేదీ నుండి విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తామని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ఇక ఈ నెల 27 నుంచి టీచర్లు పాఠశాలలకు రావాలని ఆదేశించింది.

ప్రతి ప్రభుత్వ పాఠశాలకు ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించాలని విద్యాశాఖను ప్రభుత్వం ఆదేశించింది. కాగా దూరదర్షన్, టీశాట్ ద్వారా ఆన్లైన్ క్లాసులను నిర్వహించాలని ప్రభుత్వం సూచించింది. విద్యార్ధులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని విద్యాశాఖను కేసీఆర్ సర్కార్ సూచించింది. అయితే విద్యార్ధులు బడికి ఎప్పుడు వస్తారనే అంశంపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఏదేమైనా ఆన్‌లైన్‌లో బడిగంట కొట్టేందుకు తెలంగాణ సర్కార్ రెడీ అయ్యింది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad