ఏదో ఒకరోజు బెగ్గర్ అనేవాడు లేని దేశంగా భారత్‌ను చూడాలన్నదే తన లక్ష్యమని ఇటీవల ఓ ప్రముఖ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వాతి నాయుడు చెప్పారు. తనకు రాజకీయాలంటే ఆసక్తి ఉందని తెలిపారు. నేటి సమాజంలో ఎంతోమంది పేదవారు ఎవరో వస్తారు.. ఏదో చేస్తారు.. అని ఎదురు చూసీ.. చూసీ.. చాలా మంది చాలా బాధలు పడుతున్నారు. తాను రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వెంటనే పేదవారి తరుపున పోరాటం చేస్తానన్నారు. పేదవారిని ఆకలి బాధల నుంచి దూరం చేసేందుకు తనవంతు ప్రయత్నం చేస్తానని స్వాతి నాయుడు ఇంటర్వ్యూలో చెప్పారు.
ఒకానొక సమయంలో తాను కూడా ఆకలి బాధలను అనుభవించినదానినేనని, ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చిన తాను సినీ పరిశ్రమలో చాలా స్ట్రగుల్ అనుభవించినట్టు స్వాతి నాయుడు వెల్లడించారు. నేటి సమాజంలో సమస్యలు చాలానే ఉన్నాయి. వాటిని పరిష్కరించడానికి ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని ఉందని ఆమె చెప్పుకొచ్చారు.
పలాన పార్టీలోకి రావాలని ఉందా..? అన్న ప్రశ్నకు స్వాతి నాయుడు సమాధానం చెప్తూ.. తాను రాజకీయాల్లోకి వస్తే ప్రారంభంలో ఏదో ఒక పార్టీలో చేరుతా.. ఆ పార్టీ పరిణామాలు బాగోలేకుంటే వేరే పార్టీలో చేరేందుకైనా తాను సిద్ధమేనన్నారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలన్నీ అవినీతిమయమేనన్నారు. తన రాజకీయ ఎంట్రీ పేదవారికి ఉపయోగపడేలా ఉంటుందని స్వాతి నాయుడు స్పష్టం చేశారు.