టీడీపీ అంత సులువుగా నిర్వీర్యమయ్యే రాజకీయ పార్టీ కాదని రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి అన్నారు. కాగా, ఇటీవల బీజేపీలో చేరిన ఆయన ఓ ప్రముఖ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడులూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నెగ్గకపోయినా, ప్రజల సమస్యలపై పూర్తి అవగాహన ఉందన్నారు.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో ఏఏ పార్టీలు ప్రధాన ప్రత్యర్ధులుగా బరిలో నిలవనున్నాయోనన్న విషయాన్ని తానిప్పుడే చెప్పలేనని సుజనా చౌదరి అన్నారు. రాజ్యసభలో టీడీపీ విలీనంపై ఫిర్యాదు అంశం రాజ్యసభ చైర్మన్ పరిధిలోనిదని, తనపై కేసులు ఉంటే నిరూపించాలని సుజనా చౌదరి బహిరంగ ఛాలెంట్ చేశారు.