Home Latest News త్వ‌ర‌లో ప‌సుపు- కుంకుమ రెండో విడ‌త ప్రారంభం..!

త్వ‌ర‌లో ప‌సుపు- కుంకుమ రెండో విడ‌త ప్రారంభం..!

ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వెలువ‌డ‌క ముందే రాష్ట్రంలో రాజ‌కీయ పార్టీల అధినేత‌లు ఎవ‌రికి వారు ప్ర‌చార అస్త్రాల‌ను సిద్ధం చేసుకుంటున్నారు. ప్ర‌జ‌ల‌పై హామీల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఇప్ప‌టికే ప్ర‌తిప‌క్ష పార్టీ వైసీపీ న‌వ‌ర‌త్నాలు పేరుతో కొన్ని సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తామంటూ మేనిఫెస్టోను రూపొందించ‌డంతోపాటు ఇటీవ‌ల మ‌రికొన్ని అంశాల‌ను ఆ జాబితాలో చేర్చింది.

మ‌రో ప‌క్క అధికార పార్టీ టీడీపీ సైతం మేనిఫెస్టో ప్ర‌క‌టించ‌క‌పోయినా ప్ర‌భుత్వం త‌రుపున ప్ర‌జ‌ల‌కు సంక్షేమ ప‌థ‌కాల‌ను అందించే క్ర‌మంలో స్పీడును పెంచింది. అన్నక్యాంటీన్లు, నిరుద్యోగ భృతి, పింఛ‌న్‌ల పెంపు, ప‌సుపు – కుంకుమ ప‌థ‌కాల‌ను ఇప్ప‌టికే అమ‌లు చేయ‌గా.. ఇలా మ‌రికొన్ని ప‌థ‌కాలను అమ‌లు చేసేందుకు స‌మాయ‌త్త‌మ‌వుతోంది.

అయితే, ఇటీవ‌ల టీడీపీ స‌ర్కార్ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా అమ‌లు చేసిన ప‌సుపు – కుకుమ ప‌థ‌కంలో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయని, ఆ ప‌థ‌కంతో ల‌బ్ధి చేకూర‌ని డ్వాక్రా సంఘాల మ‌హిళ‌లు చాలా మందే ఉన్నార‌ని ప్ర‌తిప‌క్షాలు ఆరోప‌ణ‌లు చేస్తున్న క్ర‌మంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం అలెర్ట్ అయింది.

ఇప్పి వ‌ర‌కు ప‌సుపు – కుంకుమ ద్వారా ల‌బ్ధి పొందిన డ్వాక్రా సంఘాల జాబితా, ల‌బ్ధి పొంద‌ని వారి జాబితాను తెప్పించుకుని, న‌గ‌దు అంద‌ని వారికి పంపిణీ చేసేలా అధికారుల‌కు ఆదేశాలు జారీ చేసింది. ఈ విష‌యాన్నే తెలుపుతూ అతి త్వ‌ర‌లో ప‌సుపు – కుంకుమ రెండో విడ‌త‌ను ప్రారంభించ‌బోతున్న‌ట్లు అధికారులు ప్ర‌క‌ట‌న‌ను జారీ చేశారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad