ఈమద్య “రిటర్న్ గిప్ట్” ల ట్రెండ్ నడుస్తుంది. కేసిఆర్ స్టార్ట్ చేసిన ఈ సాంప్రదాయాన్ని ఇప్పుడు చంద్రబాబు కొనసాగిస్తున్నాడు. అదే సాంప్రదాన్ని నేను కొనసాగిస్తా అంటూ “మా” మాజీ అధ్యక్షుడు శివాజీరాజా ముందుకొచ్చాడు. ఇటీవల జరిగిన “మా” ఎన్నికల్లో శివాజీరాజా ఓటమి పాలయిన విషయం తెలిసిందే.. అలాంటి ఆయన ఇప్పుడు రాజకీయ రంగప్రవేశం చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
ఇప్పటికే అందుకు సంబంధించిన అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఈనెల 24వ తేదీన YCP అధినేత YS జగన్ నర్సాపురం లోక్సభ స్థానంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జగన్ గారిని కలవనున్న శివాజీరాజా.. YCP కండువా కప్పుకోనున్నారని తెలుస్తుంది.
అసలు విషయం ఏంటంటే.. ఇటీవల జరిగిన “మా” అధ్యక్ష ఎన్నికల్లో శివాజీరాజా, నరేష్ చేతిలో ఓడిపోవడానికి అసలు కారణం ప్రస్తుత “జనసేన” నేత నాగబాబు గారు అనే టాక్ వినిపిస్తుంది. తాను ఏర్పాటు చేసిన “ప్రెస్ మీట్” లో కూడా శివాజీరాజా ఈ విషయాన్ని బయటపెట్టడు. పైగా త్వరలోనే నాగబాబుకు “రిటర్న్ గిప్ట్” ఇస్తానని చాలెంజ్ కూడా చేశారు.
ఈ నేపథ్యంలో జనసేన తరపున నాగబాబు గారు “నర్సాపురం” నుంచి పోటీ చేస్తున్న తరుణంలో ప్రచారంలో ఆయనకు వ్యతిరేకంగా “శివాజీరాజా”ను వినియోగించుకోవాలని YS జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. అందులో బాగంగానే YCP “నర్సాపురం” అభ్యర్థి “రఘు రామరాజు” తరపున “శివాజీరాజా”ను ప్రచారం చేయించాలని పూర్తి రంగం సిద్దం చేస్తున్నారని తెలుస్తుంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా నాగబాబును ఓడించి అతడికి “రిటర్న్ గిప్ట్” ఇవ్వడమే శివాజీరాజా ముందున్న లక్ష్యం అని తెలుస్తుంది.