ఏపీ సార్వత్రికలకు మరో తొమ్మిది రోజులే గడువు మిగిలి ఉండటంతో ఏ పార్టీ అధికారం చేపట్టబోతుంది..? ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోయేది ఎవరు..? ఏ ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్ధి విజయం సాధిస్తారు..? ఎన్ని ఓట్ల మెజార్టీ దక్కుతుంది..? అన్న ప్రశ్నలు ప్రతి ఓటరును ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఈ తరుణంలో సోషల్ మీడియాలో విడుదలైన కేకే స్ట్రాటజీస్ అండ్ సర్వేస్ సంస్థ విడుదల చేసిన సర్వేల ఫలితాలు రాజకీయా కోణంలో వైరల్గా మారింది.
అనంతపురం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో కేకే స్ట్రాటజీస్ అండ్ సర్వేస్ సంస్థ బృందం చేసిన సర్వే ప్రకారం ఏ ఏ రాజకీయ పార్టీకి, ఏ ఏ జిల్లాల్లో ఎంతశాతం మేర ఓట్లు వస్తాయో అన్న లెక్కలను సోషల్ మీడియాలో ఉంచింది. ఆ లెక్కల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి..
అనంతపురం జిల్లాలో..
టీడీపీ : 38.80 %
వైసీపీ : 44.05 %
జనసేన : 14.98 %
ఇతరులు : 2.18 %
పశ్చిమ గోదావరి జిల్లాలో..
టీడీపీ : 32.95 %
వైసీపీ : 36.71 %
జనసేన : 27.89 %
ఇతరులు : 2.45 %
తూర్పు గోదావరి జిల్లాలో..
టీడీపీ : 26.95 %
వైసీపీ : 35.58 %
జనసేన : 35.11 %
ఇతరులు : 2.35 %
విశాఖపట్నం జిల్లాలో..
టీడీపీ : 24.96 %
వైసీపీ : 37.45 %
జనసేన : 35.11 %
ఇతరులు : 2.48 %
విజయనగరం జిల్లాలో..
టీడీపీ : 32.29 %
వైసీపీ : 42.60 %
జనసేన : 22.86%
ఇతరులు : 2.25 %
ప్రకాశం జిల్లాలో..
టీడీపీ : 36.56 %
వైసీపీ : 45.93 %
జనసేన : 14.86 %
ఇతరులు : 2.65 %
గుంటూరు జిల్లాలో..
టీడీపీ : 35.64 %
వైసీపీ : 41.23 %
జనసేన : 19.32%
ఇతరులు : 3.81 %
అనంతపురం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, ప్రకాశం, గుంటూరు జిల్లాల వారీగా ఏ పార్టీకి ఎంత మంది ఓటర్లు తమ మద్దతును తెలిపారన్న వివరాలకు సంబంధించి కేకే స్ట్రాటజీస్ అండ్ సర్వేస్ సంస్థ విడుదల చేసిన ఫలితాలు ఇలా ఉన్నాయి.
టీడీపీ : 32 – 33 %
వైసీపీ : 39 – 41 %
జనసేన : 25 – 26 %
ఇతరులు : 2 – 3 %