పిల్లలపై తండ్రి ప్రేమను చూపించడం చూసాం కానీ చైనా లో ఓ శాడిస్టు తండ్రి మాత్రం తన 8 ఏళ్ల బాలుడి ప్రాణం తో చెలగాటం ఆడారు. అర్ధరాత్రి పిల్లాడిని కారు టైర్ ఫై కూర్చోబెట్టి ఆ టైర్ కి తాడు కట్టి కారుతో రోడ్డు ఫై తిప్పాడు. చిన్న పిల్లలు టైర్ ఫై కూర్చుంటే తాడుతో లాగుతూ ఆడుకుంటారు. కానీ ఈ దుర్మార్గుడు తన కన్న కొడుకునే టైర్ పై కూర్చోబెట్టి తాడును కారుకు కట్టి రోడ్డు పై ర్యాష్ డ్రైవ్ చేస్తూ పిల్లాడి ప్రాణంతో చెలగాటం ఆడాడు.
రోడ్డుకు ఈ వైపు నుంచి ఆ వైపు కు పిల్లాడిని లాగుతూ కారును వేగంగా నడిపాడు. ఆలా చేస్తే వెనుక నుంచి ఏదైనా వాహనం వచ్చిన పిల్లాడి ప్రాణానికే ప్రమాదం. ఇప్పుడు ఈ వీడియో ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన చైనా పోలీసులు కేసు నమోదు చేసి ఆ శాడిస్టు తండ్రి కోసం గాలిస్తున్నారు.