Home Latest News రూ.20 వేల కోట్లు పంచేశారు?

రూ.20 వేల కోట్లు పంచేశారు?

రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్‌ పార్టీతో తెలుగుదేశం పార్టీ చేతులు కలపడంవల్ల తెలంగాణలో ఏమి జరిగిందో అదే ఆంధ్రప్రదేశ్‌లో కూడా జరగబోతుందని మోడీ చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి కేంద్రం కృషిచేస్తుందని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా పది జాతీయ సంస్థలను ఏపీలో కేంద్రం ఏర్పాటుచేసిందని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరుగుతోందో తనకు తెలుసన్నారు. రాష్ట్రానికి తగిన సాయం అందిస్తున్నా చేయడంలేదని చెప్పడం తగదన్నారు.

ఈ వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొట్టేలా బూత్‌ స్థాయి నుండి ప్రజలకు వివరించాలని కోరారు. రెవెన్యూ లోటు, వనరుల కొరతను అధిగమించేందుకు రూ.20 వేల కోట్ల వరకు కేంద్రంనిధులు విడుదల చేసిందన్నారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం అందలేదని చెబుతోందన్నారు. ఈ డబ్బు ఎవరి జేబుల్లోకి వెళ్లిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి రూ. వెయ్యి కోట్లు కేంద్రం ఇచ్చినట్లు చెప్పారు.

వీటికి తగినట్లుగా వినియోగ ధృవపత్రాల (యూసీ)ను ఎందుకు ఇవ్వలేని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటివరకూ కేంద్రం రూ. 7 వేల కోట్లు విడుదల చేసిందన్నారు. ఈ ప్రాజెక్టుకు ఏపీ సక్రమంగా నిర్వహించలేకపోతున్నట్లు కాగ్‌ పేర్కొన్న అంశాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. పాత్రికేయ వృత్తి ఎంతో గౌరవమైనదన్నారు. నిత్యం మనం నిర్వహించే మీడియా సమావేశాల్లో మన ఫోటోలకంటే ప్రజల సమస్యను ఎత్తిచూపడానికే ప్రాధాన్యమివ్వాలన్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad