Home Latest News బిగ్ బ్రేకింగ్ : ఆర్‌కే రోజా సంచ‌ల‌న నిర్ణ‌యం..! వైఎస్ జ‌గ‌న్ త‌న విష‌యంలో ..?

బిగ్ బ్రేకింగ్ : ఆర్‌కే రోజా సంచ‌ల‌న నిర్ణ‌యం..! వైఎస్ జ‌గ‌న్ త‌న విష‌యంలో ..?

ఏప్రిల్ 11న జ‌రిగిన సార్వ‌త్రికల ఫ‌లితాలు వెలువ‌డేందుకు ఇంకా 14 రోజుల స‌మ‌యం ఉన్న సంగ‌తి తెలిసిందే. ఓట‌ర్లు ఇచ్చిన తీర్పు ఈవీఎంల నుంచి బ‌య‌ట‌కు రాక ముందే విజ‌యం త‌మ‌దంటే.. త‌మ‌ద‌ని టీడీపీ, వైసీపీ వ‌ర్గాలు పోటా పోటీగా మీడియా ముందుకొచ్చి మాట‌ల తూటాలు పేల్చుతున్నారు. ఇలా ఏపీ రాజ‌కీయాల సెగ‌లు ఆకాశాన్నంటుతున్న త‌రుణంలో విడుద‌ల‌వుతున్న స‌ర్వే ఫ‌లితాలు వైసీపీ శ్రేణుల్లో మ‌రింత ఉత్సాహాన్ని నింపుతున్నాయి.

ఏపీ ఓట‌ర్లు ఇచ్చిన తీర్పు వైసీపీకి అనుకూలంగా ఉండ‌బోతుంద‌ని, మే 23న వెలువ‌డ‌నున్న ఎన్నిక‌ల ఫ‌లితాలే అందుకు నిద‌ర్శనం కాబోతున్నాయ‌ని వైసీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. స‌ర్వేల‌న్నీ కూడా వైసీపీ ప్ర‌భుత్వం రాబోతుంద‌ని చెబుతున్న క్ర‌మంలో, ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ బాధ్య‌త‌లు స్వీక‌రించ‌డం ఖాయ‌మంటూ ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నారు. ఈ అంశాల‌న్నిటిన దృష్టిలో ఉంచుకున్న వైసీసీ శ్రేణులు జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయితే, ఆయ‌న క్యాబినేట్‌లో మంత్రులుగా ఎవ‌రెవ‌రికి చోటు ద‌క్క‌నుందంటూ ఇప్పటి నుంచే సామాజిక‌వ‌ర్గాల వారీగా లెక్క‌లు వేసుకుంటున్నారు.

ఇలా జ‌గ‌న్ కేబినేట్‌కు సంబంధించి విస్తృత స్థాయిలో చ‌ర్చ‌లు జ‌రుగుతున్న జిల్లాల్లో ప్ర‌ధానంగా చిత్తూరు జిల్లా పేరు వినిపిస్తోంది. అయితే, జిల్లాలో మొత్తంగా 14 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్న సంగ‌తి తెలిసిందే. వారిలో కొంద‌రు రాజ‌కీయంగా సీనియ‌ర్‌లు ఉండ‌గా, మ‌రికొంద‌రు కొత్త‌గా తొలిసారి ఎన్నిక‌ల బ‌రిలో నిలిచిన వారూ ఉన్నారు. దీంతో రాజ‌కీయంగా సీనియ‌ర్‌లుగా ఉన్న వారిలో ఎవ‌రిని మంత్రి ప‌ద‌వులు వ‌రించనున్నాయ‌న్న చ‌ర్చ ఆ పార్టీ శ్రేణుల్లో
జ‌రుగుతోంది.

అయితే, చిత్తూరు జిల్లా న‌గ‌రి నుంచి ఆర్‌కే రోజా ఎమ్మెల్యే అభ్య‌ర్ధిగా వైసీపీ నుంచి మ‌రోసారి బ‌రిలో నిలిచిన సంగ‌తి తెలిసిందే. ఇక న‌గ‌రిలో వైసీపీకి ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్ధి పార్టీగా ఉన్న టీడీపీ నుంచి దివంగ‌త మంత్రి గాలి ముద్దు కృష్ణ‌మ నాయుడు త‌న‌యుడు భాను ప్రకాష్ ఎన్నిక‌ల బ‌రిలో నిలిచారు. ఈ నేప‌థ్యంలో ఆర్‌కే రోజా మ‌రోసారి విజ‌యం సాధించ‌డం ఖాయ‌మ‌నే స‌మాచారం ఆ పార్టీ వ‌ర్గాల నుంచి వినిపిస్తున్నాయి. దీంతో జ‌గ‌న్ సీఎం అయితే ఆర్‌కే రోజాకు మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించ‌డం క‌న్ఫామ్ అనే వార్త‌లు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

ఇదిలా ఉండ‌గా, ఆర్‌కే రోజాకు మంత్రి ప‌ద‌వి కేటాయించ‌డానికి ఉన్న అర్హ‌త‌లు, కార‌ణాల‌ను వివ‌రిస్తూ ప‌లు క‌థ‌నాలు ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. జ‌గ‌న్‌కు అత్యంత విశ్వ‌స‌నీయ‌త‌గ‌ల వ్య‌క్తుల్లో ఆర్‌కే రోజా ఒక‌ర‌ని, పార్టీ ప‌రంగా ముఖ్య‌మైన నిర్ణ‌యాలు తీసుకునే వారిలో రోజా ఒక‌ర‌ని, ప్ర‌త్య‌ర్ధుల‌పై ఆధారాల‌తో స‌హా విరుచుకుప‌డ‌టం ఆమె వాక్చాతుర్యానికి నిద‌ర్శ‌న‌మ‌ని వారు చెబుతున్నారు. ఈ క్ర‌మంలోనే దివంగ‌త సీఎం వైఎస్ఆర్ నాడు స‌బితా ఇంద్రారెడ్డికి హోంశాఖను కేటాయించిన‌ట్టుగా, వైఎస్ జ‌గ‌న్ కూడా ఆర్‌కే రోజాకు హోంమంత్రి ప‌ద‌వి కేటాయించ‌డం క‌న్ఫామ‌నే వార్త‌లు చిత్తూరు జిల్లా మీడియాలో ప్ర‌చురిత‌మ‌వుతున్నాయి.

ఇలా ఆర్‌కే రోజాను కేంద్రంగా చేసుకుని అటు ప్ర‌సార మీడియాలో, ఇటు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిన హోమంత్రి శాఖ కేటాయింపు అన్న క‌థ‌నాల‌పై ఆమె స్పందించారు. వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి త‌న‌కు అన్న‌తో స‌మాన‌మ‌ని, త‌న రాజ‌కీయ ఎదుగుద‌ల‌కు స‌హ‌క‌రించిన జ‌గ‌న్‌కు తాను ఎప్ప‌టికీ రుణ‌ప‌డి ఉంటాన‌ని ఆమె చెప్పారు. వైసీపీ టికెట్‌పై ఎమ్మెల్యేగా గెలుపొందిన తాను త‌న జీవితాంతం ఆ పార్టీలోనే ఉంటానంటూ స్ప‌ష్టం చేశారు.

ఇక హోంశాఖ కేటాయిస్తారంటూ వ‌స్తున్న క‌థ‌నాల‌పై స్పందిస్తూ, త‌న విష‌యంలో జ‌గ‌న్ ఎటువంటి నిర్ణ‌యం తీసుకున్నా తాను శిర‌సా వ‌హిస్తానంటూ చెప్పారు. వైఎస్ జ‌గ‌న్ ఏ నిర్ణ‌యం తీసుకున్నా ప్ర‌జా సంక్షేమం కోస‌మే క‌నుక‌, ఆ విష‌యాల‌ను దృష్టిలో పెట్టుకుని, పార్టీకి అనుగుణంగా న‌డుచుకోవ‌డం త‌న బాధ్య‌త అంటూ ఆర్‌కే రోజా చెప్ప‌డం గ‌మనార్హం. ఇదిలా ఉండ‌గా, నాడు న‌గ‌రిలో ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా, జ‌గ‌న్ మాట్లాడుతూ దేవుడు ఆశీర్వ‌దించి వైసీపీ అధికారంలోకి వ‌స్తే త‌న చెల్లెలితో స‌మాన‌మైన ఆర్‌కే రోజాకు కీల‌క ప‌ద‌వి ఇస్తానంటూ జ‌గ‌న్ చెప్పిన సంగ‌తి తెలిసిందే.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad