విద్యార్థినుల్లో, మహిళల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు ఏబీవీపీ, విద్యానిధి స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా మిషన్ సాహసి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కేవలం పట్టణాల్లోనే కాకుండా, గ్రామ స్థాయిల్లో, ప్రతి పాఠశాల, కళాశాలల్లో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడుతోంది. అందులో భాగంగా నగరి ప్రభుత్వ పాఠశాలలో జరిగిన మిషన్ సాహసి కార్యక్రమంలో ఎమ్మెల్యే రోజా పాల్గొని మాట్లాడారు.
దేశ వ్యాప్తంగా విద్యార్థినుల్లో, మహిళల్లో ఆత్మస్థైర్యాన్ని నింపే విధంగా మిషన్ సాహసి కార్యక్రమం నిర్వహించడం సంతోషకరమని రోజా అన్నారు. మిషన్ సాహసితో సత్ఫలితాలు ఉంటాయని తాను భావిస్తున్నానన్నారు. ఆడ పిల్ల అంటే అగ్గిపుల్ల అంటూనే వెలిగితే దేన్నైనా దహించగలదన్నారు. ఆడ పిల్లను రాంగ్‌సైడ్ గోకినోడికి కూడా అలానే ఉంటుందన్నది ప్రతి ఒక్కరు తెలియజేయాలన్నారు. ఒక ఆకతాయి ఆడ పిల్లలను ఒక మాట అన్నా.. పైట లాగినా, గిల్లాలని ఆలోచన వచ్చినా అటువంటి వాడి మక్కెలు ఇరగ్గొట్టాలన్నారు. మిషన్ సాహసితో ప్రతి ఒక్కరు స్ట్రాంగ్ అవ్వాలని పిలుపునిచ్చారు.