Home Latest News త్వరలో కేఏ పాల్ కు శిలువ..! ఆర్.జి.వి

త్వరలో కేఏ పాల్ కు శిలువ..! ఆర్.జి.వి

వివాద స్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ నిప్పు రాజేస్తూనే ఉంటాడు. ఈ విషయము అందరికి తెలిసిందె. సంచలన వ్యాఖ్యలు చేసే కేఏ పాల్ కూడా తక్కువ ఏమి కాదు. వీరిద్దరూ దొందు దొందే అన్నట్లు, ఒకరికొకరు సెటైర్స్ ఇంకా వేసుకుంటూనే ఉన్నారు. వీరి మధ్య కొంత కాలంగా ట్విట్టర్ వార్ జరుగుతుంది. వీరిద్దరి యుద్ధం ఇప్పుడు హల్చల్ గా మారి, వీక్షకులకు ఎప్పుడేం జరుగుతుందాని ఉత్కంఠకు గురి చేస్తుంది. తాజాగా వర్మ, జీసస్ క్రైస్ట్ తో వాట్స్ అప్ చేశాడట.

సంచల దర్శకుడు ఆర్.జి.వి గత కొంత కాలం క్రితం ట్విట్టర్ లో వర్మ  ‘మోదీ, చంద్రబాబుల’ లాంటి చిన్న నాయకులతో పోటీ చేయడమెందుకంటూ, జీసన్ ను ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించి, ఆ ప్రపంచానికి కేఏ పాల్ ని అధ్యక్షతను వహించమని ట్వీట్ చేశాడు. దీనికి బదులుగా ముంబై తాజ్ హోటల్ లో వర్మ నా పాదాలను ముట్టుకున్నాడని, ఆశీర్వాదం అందించానని పాల్ ఏకంగా వారిద్దరూ కలిసున్న ఫోటో ని ట్వీట్ పెట్టాడు.

దీనికి వర్మ కౌంటర్ గా ‘జీసస్..! నేను పాల్ కాళ్లు పట్టుకోలేదు. అలా పట్టుకుని లాగితే నేలకేసి కొట్టుకుని, అతని బుర్ర సెట్ అవుతుందని ఆశపడ్డా.. కానీ మీరు నాకు శాపమిస్తారని వదిలేశానని’ కామెంట్ చేశాడు. ఇప్పుడు మళ్లీ తాజాగా వర్మ ట్విట్టర్ లో అతి పెద్ద సెటైర్ వేశాడు. ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ కు శిలువ వేయబోతున్నానని ఇప్పుడే జీసస్ క్రైస్ట్ నాకు వాట్సాప్ మెసేజ్ చేశాడంటూ వర్మ ట్వీట్ చేశాడు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad