ప్రముఖ నటి, టాలీవుడ్ సూపర్‌స్టార్ కృష్ణ సతీమణి విజయ నిర్మల అకాల మరణం యావత్ సినీ లోకాన్ని శోకసంద్రంలో ముంచింది. గుండెపోటుతో బాధపడుతున్న ఆమె బుధవారం అర్ధరాత్రి గచ్చిబౌలి కాంటినెంటల్ ఆస్పత్రిలో మృతి చెందిన విషయం తెలిసిందే. శుక్రవారం నాడు ఆమె అంత్యక్రియలు ముగిసిన నేపథ్యంలో ఆమె భౌతికఖాయానికి పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. ఇదే సందర్భంలో కన్నీరు మున్నీరుగా విలపించిన కృష్ణను ఓదార్చేందుకు కొందరు ప్రయత్నించినా.. అది వారి సాధ్యం కాలేదు. అంతలా కృష్ణ, విజయ నిర్మల మధ్య ప్రేమబంధం అల్లుకుందంటే నమ్మశక్యం కాదేమో.
విజయ నిర్మల భౌతికఖాయానికి నివాళులు అర్పించిన వారిలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో దివంగత సీఎం వైఎస్ఆర్ కుటుంబానికి, కృష్ణ కుటుంబానికి మధ్య ఉన్న అనుబంధం గురించి అటు సినీ ప్రముఖులతోపాటు, ఇటు రాజకీయవర్గాల్లోను విస్తృతస్థాయి చర్చలు జరిగాయి. ఇంతకీ ఇరు కుటుంబాల మధ్య ఉన్న బంధం ఏమిటి..? ఎప్పుడు మొదలైంది..? వైఎస్ఆర్, కృష్ణ స్నేహం ఎలా బలపడింది..? అన్న ప్రశ్నలకు సంబంధించి పూర్తి సమాచారం ఈ వీడియోలో మీ కోసం..