Home Latest News రూ.4ల‌కే పేద‌ల క‌డుపునింపుతున్న 'రాజ‌న్న‌'

రూ.4ల‌కే పేద‌ల క‌డుపునింపుతున్న ‘రాజ‌న్న‌’

అవును, దివంగ‌త ముఖ్య‌మంత్రి రాజ‌శేఖ‌ర్‌రెడ్డి భౌతికంగా మ‌న‌కు దూర‌మైనా ప్ర‌జ‌ల గుండెల్లో ఇంకా బ‌తికే ఉన్నాడు. పేద‌ల ఆక‌లిని తీరుస్తూనే ఉన్నాడు. గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్ అభిమాని రాజ‌న్న పేరుతో ఏర్పాటు చేసిన క్యాటీన్‌లో రూ.4ల‌కే భోజ‌నం అందిస్తూ పేద‌ల ఆక‌లిని తీరుస్తున్నాడు.

ఇక రాజ‌న్న క్యాంటీన్‌కు సంబంధించి అస‌లు విష‌యానికొస్తే.. మేడా వెంక‌టేశ్వ‌ర్‌రెడ్డి, గుంటూరు జిల్లా నెకిరేక‌ల్ మండ‌లం న‌ర్సిక‌పాడు గ్రామ‌వాసి. కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి స్క్రాప్ బిజినెస్ చేస్తూనే వ్య‌వ‌సాయం కూడా చేస్తున్నాడు. వ్యాపారం చేస్తూనే పేద‌ల‌కు ఏదో ఒక‌టి చేయాల‌ని మేడా వెంక‌టేశ్‌రెడ్డి ఆలోచించాడు. అలాంటి ఆలోచ‌న‌ల నుంచి పుట్టిందే రాజ‌న్న క్యాంటీన్.

మండ‌ల కేంద్ర‌మైన నెకిరేక‌ల్ చుట్టుప‌క్క‌ల గ్రామాల నుంచి పెద్ద సంఖ్య‌లో జ‌నం నిత్యం వ‌స్తుంటారు. వారిలో పేద‌లు ఎక్కువ‌గా ఉంటారు. అలాంటి వారికి క‌డుపు నిండా అన్నం పెట్టాల‌నే ఉద్దేశంతో వెంక‌టేశ్వ‌ర్‌రెడ్డి పేద‌ల క‌డుపు నింపాల‌ని అనుకున్నాడు. అలాగే వెంక‌టేశ్వ‌ర్‌రెడ్డికి దివంగ‌త సీఎం వైఎస్ఆర్ అంటే ఎన‌లేని అభిమానం.

వైఎస్ఆర్ అమ‌లు చేసిన సంక్షేమ‌, అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు విప‌రీతంగా ఆక‌ర్షితుడైన వెంక‌టేశ్వ‌ర్‌రెడ్డి ఇంకేమీ ఆలోచించ‌కుండా నెకిరేక‌ల్‌లో త‌న‌కున్న సొంత స్థ‌లంలో షెడ్‌ను నిర్మించి అందులోనే రాజ‌న్న క్యాంటీన్‌ను ప్రారంభించాడు. ప్ర‌తీ రోజు కూర‌గాయ‌లు, బియ్యం తీసుకు రావ‌టం నుంచి పేద‌ల క‌డుపు నిండా అన్నం పెట్టే వ‌ర‌కు అన్నీ వెకంటేశ్వ‌ర్‌రెడ్డే ద‌గ్గ‌రుండి చూసుకుంటున్నాడు.

ఇలా ప్ర‌తి రోజూ 500 నుంచి 600 మంది వ‌ర‌కు పేద‌ల క‌డుపు నింపుతున్నాడు వెంక‌టేశ్వ‌ర్‌రెడ్డి. ప్ర‌తి రోజు పేద‌లంతా త‌న క్యాంటీన్‌కు వ‌చ్చి భోజ‌నం చేస్తుంటే త‌న‌కెంతో సంతోషంగా ఉంద‌ని క‌ర్చు ఎంతైన‌ప్ప‌టికీ.. పేద‌ల‌కు సాయం చేస్తున్నామ‌న్న ఆనందం త‌న‌కు ఎంతో సంతృప్తిని ఇస్తుంద‌ని వెంక‌టేశ్వ‌ర్‌రెడ్డి చెబుతున్నాడు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad