ఏపీలో బలంగా రాజకీయం చేస్తామని కమలనాథుడు ధీమాగా పైకి చెబుతున్నప్పటికీ వాస్తవం మాత్రం అందుకు విరుద్ధంగానే ఉందన్నది రాజకీయ విశ్లేషకుల మాట. ఏపీలో సింగల్గా పోటీ చేస్తే మాత్రం బీజేపీ ఒక్క ఎమ్మెల్యేను కానీ, ఎంపీనికానీ గెలుచుకునే అవకాశం లేదని రాజకీయ పరిశీలకులు సైతం తేల్చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఒక్కొక్కరుగా బీజేపీ నేతలు దుకాణం సర్దేసుకోవడం ఇప్పటికే మొదలైంది. ఆ క్రమంలోనే బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ జనసేనకు జై కొట్టేశారు. పురందేశ్వరి బీజేపీలోనే కొనసాగుతున్నా తన కుమారుడిని మాత్రం వైసీపీలోకి పంపి ఏపీలో బీజేపీ బలం ఎంతో చెప్పకనే చెప్పేశారు. రాబోయే రోజుల్లో పురందేశ్వరి కూడా పార్టీ మారుతారా..? అన్న చర్చకు ఆమె కుమారుడి ఎపిసోడ్ తెరతీసేసింది.