Home Latest News నాదేశం కోసం మా కొడుకులందరినీ త్యాగం చేయడానికి మేము సిద్దం

నాదేశం కోసం మా కొడుకులందరినీ త్యాగం చేయడానికి మేము సిద్దం

జమ్ముకశ్మీర్‌ లో జరిగిన “పుల్వామా ఉగ్రదాడి”తో దేశ యువత రక్తం మరుగుతుంది. అందుకే ఉగ్రవాదులను పెంచి పోసిస్తున్న పాకిస్తాన్ ని ప్రపంచపటంలోనే లేకుండా చేయాలి అంటూ డిమాండ్ చేస్తుంది యువత. కానీ అది సాద్యమయ్యే పనేనా ? మన దేశ మిలటరీ కూడా కసిమీద ఉంది. ప్రభుత్వం పర్మిషన్ ఇస్తే ఒక్కటంటే ఒక్క రోజులోనే పాకిస్తాన్ని ప్రపంచ పటంలో లేకుండా భూస్థాపితం చేస్తాం అంటూ పర్మిషన్ కోసం ఎదురుచూస్తున్నారు..

కానీ ఇది రాజుల కాలం కాదు. చైనా లాంటి కొన్ని దేశాలు పాకిస్తాన్ కి లోలోపల సహాయం చేస్తున్నాయి. ఇలాంటి టైమ్ లో ఏ చిన్న తప్పు చేసిన ప్రపంచ యుద్దానికి దారితీస్తుంది. అదే గనక జరిగితే ఒక పాకిస్తాన్ మాత్రమే కాదు మన దేశం కూడా ప్రమాదంలో పడుతుంది. ఈ కరణంగానే “ఐక్యరాజ్య సమితి” యుద్దాలు కాకుండా సమరస్యంగా సమస్యను పరిస్కరించుకుందాం అంటుంది. కానీ పాకిస్తాన్ మాత్రం వినడం లేదు.. ఎలాగైనా కాశ్మీర్ ని సొంతం చేసుకొని మన దేశాన్ని దెబ్బకొట్టాలని చూస్తుంది పాకిస్తాన్..

అందులో బాగమే ఇప్పుడు జరిగిన “పుల్వామా ఉగ్రదాడి”. అందుకే అవకాశం వస్తే మాతృభూమి కోసం తమ కొడుకులందరినీ సైతం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నామని మధ్యప్రదేశ్‌ లోని “కుదవాల్‌ సిహోరా” గ్రామస్థులు రగిలిపోతున్నారు.. ఈ గ్రామానికి చెందిన 36ఏళ్ల “అశ్విన్‌ కచ్చి” అనే జవాన్ నిన్న పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయారు.

దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. “మేము చాలా బాధపడుతున్నాం. కానీ మా “అశ్విన్‌ కచ్చి” దేశం కోసం అమరుడైనందుకు ఎంతగానో గర్విస్తున్నాం.. ఇప్పటికే మా గ్రామం నుండి 30 మందికి పైగా సైన్యంలో చేరారు. అవకాశం వస్తే మాతృభూమి కోసం మా కొడుకులందరినీ త్యాగం చేస్తాం” అని గర్వంగా చెబుతున్నారు ఆ గ్రామ ప్రజలు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad