ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రయోజనాలను పక్కనపెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎంపీ అవంతి శ్రీనివాస్ అన్నారు. కాగా, బుధవారం నాడు టీడీపీకి రాజీనామా చేసిన ఎంపీ అవంతి శ్రీనివాస్ కాసేపటి క్రితం లోటస్‌పాండ్‌లోని జగన్ నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు. భేటీ అనంతరం ఎంపీ అవంతి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న అవకాశవాద రాజకీయ నిర్ణయాలను ప్రజలందరూ నిశితంగా గమనిస్తున్నారన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదని ప్రజలందరూ ఒక నిర్ణయానికి వచ్చినట్లు అవంతి శ్రీనివాస్ తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని మొదట్నుంచి ఒకే స్టాండ్‌పై ఉన్న ఒకే ఒక్క వ్యక్తి వైఎస్ జగన్ మాత్రమేనన్నారు. ఏపీలోని ఒక టీడీపీ ఎమ్మెల్యే అవినీతి గురించి పూర్తి రిపోర్టు ప్రధాన మంత్రి కార్యాలయానికి చేరిందని, రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై ప్రధానమంత్రి కార్యాలయం విచారణ జరిపించడంతో మోడీ, చంద్రబాబు మధ్య విభేదాలు తలెత్తాయన్నారు.