ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు నేడు తిరుమల తిరుపతిలో వేంచేసిన శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. శ్రీవారిని దర్శించుకున్న వారిలో మనవడు దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా నారా భువనేశ్వరి, బ్రాహ్మణి, దేవాన్ష్ ఉన్నారు. వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారిని దర్శించుకున్న వీరు మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ సందర్భంగా తిరుమలలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు దేవాన్ష్కు వేదపండితుల ఆశీర్వచనాలు అందజేశారు. టీటీడీ అధికారులు తీర్ధ ప్రసాదాలు ఇచ్చారు. ఆపై తరిగొండ వెంగమాంబ భవనంలో భక్తులందరితో కలిసి ఉచిత అన్నదాన ప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఒక్క రోజు అన్న వితరణకు అయ్యే ఖర్చు రూ.30 లక్షలను టీటీడీ ఎస్వీ అన్న ప్రమాద ట్రస్టుకు సీఎం సతీమణి నారా భువనేశ్వరి విరాళంగా అందజేశారు.