బస్టాండ్లో బస్కోసం ఎదురు చూస్తున్న ఓ వయుతిని ట్రాప్ చేసిన కానిస్టేబుల్ మాయ మాటలతో లొంగదీసుకుని లాడ్జీకి తీసుకెళ్లాడు. ఇంతలో పరిస్థితిని గమనించిన స్థానికులు మీడియాకు సమాచారం అందించారు. యువతి, కానిస్టేబుల్ ఇద్దరూ ఒకే రూములో ఉండటాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
కడెం మండలానికి చెందిన ఓ యువతి నిర్మల్ బస్టాండ్లో బస్ కోసం ఎదురు చూస్తుండగా ఏబీ నైజర్ అనే సీసీఎస్ కానిస్టేబుల్ ఆ యువతి వివరాలు తెలుసుకునే క్రమంలో మాటా మాటా కలిపి ఆమెను తన బైక్ మీద సమీపంలోని లాడ్జీకి తీసుకెళ్లాడు.
అయితే, పట్టుబడ్డ కానిస్టేబుల్ మాత్రం తనకేం పాపం తెలీదని, అక్రమంగా బియ్యం తరలించే వ్యాపారులు కుట్రపన్ని తనను ఇరికించినట్టు చెప్పుకొచ్చారు. తాను కేవలం లాడ్జీలో ఆ యువతిని ఉంచేందుకు వచ్చానని, ఈ సమయంలోనే స్థానికులు వచ్చి రచ్చ చేశారన్నారు. ఈ సంఘటనపై పూర్తి సమాచారం కోసం దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్పీ తెలిపారు.