టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ మరోసారి ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిలపై ట్వీట్టర్ వేదికగా ఫైరయ్యారు. ఏ1 ముద్దాయి అవినీతిపై కమిటీ వేయడమా..? అంటూ ప్రశ్నలను మొదలు పెట్టిన నారా లోకేష్ దివంగత సీఎం వైఎస్ఆర్ హయాంలో సోలార్ విద్యుత్ కొనుగోళ్లను ప్రస్తావించారు. నారా లోకేష్ ట్విట్టర్లో పేర్కొన్న మరిన్ని అంశాలు..
నీతి, నిజాయితీ పునాదిగా ఎదిగిన మా అధినేత @ncbn గారి పై అవినీతి ముద్ర వెయ్యాలి అనుకుంటున్న మీ ప్రయత్నం విఫలయత్నంగానే మిగిలిపోతుంది
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) June 28, 2019