Home Latest News బిడ్డ భూమిపై ప‌డ‌గానే ప‌రారైంది..!

బిడ్డ భూమిపై ప‌డ‌గానే ప‌రారైంది..!

గ‌ర్భంలో నుంచి శిశువు బ‌య‌ట‌ప‌డ‌గానే ఓ బాలింత అక్క‌డి నుంచి చ‌ల్ల‌గా జారుకుంది. ఆస్ప‌త్రిలో వ‌దిలేసిన బిడ్డ కోసం మ‌ళ్లీ వ‌స్తుందిలే అని భావించిన వైద్యులు ఆమె ఎంత‌కీ రాక‌పోవ‌డంతో పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. సంఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు బిడ్డ‌ను శిశు విహార్‌కు త‌ర‌లించారు.

కాగా, ఈ నెల 7న హైద‌రాబాద్ పేట్లబురుజు ప‌రిధిలోగ‌ల ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో ఈ సంఘ‌ట‌న జ‌రిగింది. మహ్మ‌దీ బేగం అనే గ‌ర్భిణీ ప్ర‌స‌వం నిమిత్తం ఆసుప‌త్రిలో చేరింది. మహ్మ‌దీ బేగంకు ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన వైద్యులు గ‌ర్భం నుంచి శిశువును బ‌య‌ట‌కు తీశారు. ఆ మ‌రుస‌టి రోజు నుంచే అంటే 8వ తేదీ నుంచే ఆ బాలింత బిడ్డ‌ను ఆస్ప‌త్రిలోనే వ‌దిలి ప‌రారైంది.

మ‌హ్మ‌దీ రాక కోసం ఎదురు చూసిన వైద్యులు చివ‌ర‌కు బిడ్డ‌తో స‌హా పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. వైద్యుల స‌మాచారం మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు కేసు న‌మోదు చేసుకుని శిశువును శిశు విహార్‌కు త‌ర‌లించారు. మ‌హ్మ‌దీ బేగం కోసం గాలింపులో భాగంగా ప‌రిస‌ర ప్రాంతాల్లోని సీసీ టీవీ ఫుటేజ్‌ల‌ను ప‌రిశీలిస్తున్న‌ట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad