Home Latest News సీఎం షాకింగ్ నిర్ణయం.. సెప్టెంబర్ 20 వరకు లాక్‌డౌన్ పొడగింపు!

సీఎం షాకింగ్ నిర్ణయం.. సెప్టెంబర్ 20 వరకు లాక్‌డౌన్ పొడగింపు!

Mamata Banerjee Extends Lockdown Till September 20

దేశవ్యాప్తంగా రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం దేశాన్ని లాక్‌డౌన్ నుండి పూర్తిగా బయటకు తీసుకొస్తుంటే, కొన్ని రాష్ట్రాల్లో మాత్రం చాలా కఠినమైన నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయి. అయితే తాజాగా ఓ సీఎం తమ రాష్ట్రంలో ఏకంగా సెప్టెంబర్ 20 వరకు లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో కరోనా కట్టడిలో ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని ఆ సీఎం కోరారు.

పశ్చిమ బెంగాల్‌లో కరోనా మహమ్మారి విజృంభన తీవ్ర స్థాయిలో ఉండటంతో ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ఈ మేరకు లాక్‌డౌన్‌ను పొడగించారు. వారానికి రెండు రోజుల పాటు షట్‌డౌన్ కొనసాగుతుందని, ఇది సెప్టెంబర్ 17వ తేదీ వరకు ఉంటుందని ఆమె తెలిపారు. కాగా ఆగస్టు 27, 31 తేదీల్లో.. సెప్టెంబర్ 7, 11, 12 తేదీల్లో బెంగాల్‌లో పూర్తిస్థాయి లాక్‌డౌన్ ఉండనుందని ఆమె తెలిపారు. ఈ లాక్‌డౌన్ సమయంలో విద్యాసంస్థలు పూర్తిగా మూసివేయబడుతయని ఆమె తెలిపింది.

ఇక వారంలో మూడు రోజుల పాటు విమానాల రాకపోకలకు అనుమతిని ఇస్తున్నట్లు ఆమె తెలిపారు. అన్ని రకాల ప్రభుత్వ మరియు ప్రైవేట్ కార్యాలయాలు, వాణిజ్య సంస్థలు కూడా ఈ లాక్‌డౌన్ సమయంలో మూసివేయబడుతాయని ఆమె పేర్కొన్నారు. మొత్తానికి కరోనా నేపథ్యంలో మరోసారి బెంగాల్ రాష్ట్రంలో లాక్‌డౌన్ వాతావరణం కనిపిస్తుండటంతో ప్రజలు అప్రమత్తం అవుతున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad