బిగ్ బి అమితాబ్, షారుఖ్, ప్రియాంక, ఐశ్వర్య ఇలా పలువురు బాలీవుడు స్టార్ ల మైనపు బొమ్మలు మాత్రమే ఇప్ప్పటివరకు ఆ మ్యూజియంలో కలవు. ఆ తర్వాత దక్షిణాది తారల నుంచి కేవలం ప్రభాస్ నుంచి మాత్రమే సొంతం చేసుకోగా ఇప్పుడు ప్రిన్స్ మహేష్ బాబు మైనపు బొమ్మను పెట్టడానికి సిద్ధపడ్డారు. అంతేకాదు ప్రిన్స్ మహేష్ బాబు మైనపుబొమ్మ రెడీ చేశారు. ప్రఖ్యాతి గాంచిన బ్యాంకాక్ లోని మేడమ్ టుస్సాడ్స్ సంస్థ ఈ మైనపుబొమ్మను రూపొందించింది. మ్యూజియమ్ లో మహేష్ బాబు మైనపుబొమ్మను శాశ్వతంగా ఉంచనున్నారు.
విషయానికొస్తే, మహేష్ బాబు కొలతలు తీసుకోవడానికి, మ్యూజియం టీమ్ వారు హైదరాబాద్ వచ్చి మహేష్ బాబు ‘భారత్ అనే నేను’ సినిమా షూటింగ్ టైమ్ లోనే తీసుకొని వెళ్లిందట. మేడమ్ టుస్సాడ్స్ సంస్థ ఈ బొమ్మను బ్యాంకాక్ మ్యూజియమ్ లో ప్రదర్శించనున్నారు. ఈ సారి మేడమ్ టుస్సాడ్స్ కొత్త నిర్ణయాన్ని తీసుకుంది.
బ్యాంకాక్ మ్యూజియమ్ లో శాశ్వతంగా నెలకొలిపే మైనపు బొమ్మను, హైదరాబాద్ లో మహేష్ బాబు అభిమానులకు చూసే అవకాశాన్ని కల్పించాలనుకున్నారు. ఈ సందర్బంగా మహేష్ అభిమానుల సందేశానార్ధమై విగ్రహాన్ని మార్చి 25 న హైదరాబాద్ నగరానికి తీసుకవస్తున్నారు. మహేష్ బాబు AMB సినిమాస్ మల్టిప్లెక్స్ లో ఈ మైనపుబొమ్మను ప్రదర్శిస్తారు. ఒక్క రోజు మాత్రమే ఈ అవకాశాన్ని కల్పిస్తున్నారు. ప్రదర్శన పూర్తయిన తర్వాత మైనపు బొమ్మను బ్యాంకాక్ కు తీసుకెళ్లి అక్కడి నుంచి మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం ప్రధాన కార్యాలయం లండన్ కు తరలిస్తారని సమాచారం.