హైదరాబాద్ నగర పరిధిలోగల ఔటర్రింగ్రోడ్డులో గన్తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ ఫైజల్ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఫైజల్ కేసులో కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఫైజల్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని ఎవరో హత్యచేసి అక్కడ పడేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ఫైజల్ రూ.3కోట్ల డీల్కోసం వెళ్లాడని, ఆ సమయంలో ఫైజల్ వద్ద గన్ లేదని పోలీసుల ముందు భార్యత, తల్లి ఇద్దరూ కన్నీరుమున్నీరుగా విలపించారు. కుటుంబ సభ్యుల మాటలను పరిగణలోకి తీసుకున్న నార్సింగ్ పోలీసులు ఫైజల్ కాల్ రికార్డులను పరిశీలిస్తున్నారు.