కొన్నేళ్లక్రితం టీ 20 ఫార్మాట్ లేని సమయంలో క్రికెట్లో డేరింగ్ బ్యాట్స్‌మెన్ చాలా అరుదుగా కనిపించేవారు. స్టేడియంలో డేరింగ్ బ్యాట్స్‌మెన్ చాలా అరుదుగా కనిపించేవారు. స్టేడియంలో కూర్చున్న ప్రతిఒక్కరూ బౌలర్ బంతిని ఎంత వేగంగానైతే విసిరాడో అంతకంటే రెట్టింపు వేగంతో బ్యాట్స్‌మెన్ కొట్టాలనే అందరూ ఎదురుచూస్తుంటారు. మునుపెన్నడూ లేనివిధంగా అదిరిపోయే షాట్లుకొట్టే క్రికెటర్లను తమ ఆరాధ్య క్రికెటర్‌గా భావిస్తుంటారు. అటువంటి దూకుడున్న బ్యాట్స్‌మెన్ గురించి వివరాల్లోకి వెళితే..
వీరేంద్ర సెహ్వాగ్
సెహ్వాగ్ మామూలుగానే సుల్తాన్ (కింగ్)అని పిలుస్తుంటారు. ఏమాత్రం బెరుకు లేకుండా అతను ఆడే శైలి అందరికీ నచ్చుతుంది. ఇన్నింగ్స్‌లో తొలి బంతి నుంచి అదే వేగంతో ఆడుతుంటాడు. అది టీ20 ఫార్మట్ అయినా వన్డే, టెస్టులు అయినా సరే. 2004 మార్చి 29న ముల్తాన్ గడ్డపై పాకిస్తాన్ జట్టుతో తలపడిన మ్యాచ్‌లో…సెహ్వాగ్ 309 పరుగులు చేశాడు. అదే దూకుడుతో చెన్నై వేదికగా దక్షిణాఫ్రికాతో తలపడిన మ్యాచ్‌లో చరిత్రను తిరగరాస్తూ ట్రిపుల్ సెంచరీ నమోదు చేశాడు.
క్రిస్ గేల్
సెహ్వాగ్ తర్వాత అంతటి దూకుడున్న ఆటగాడెవరంటే క్రిస్ గేల్ పేరే చెప్పాలి. సిక్సుల యంత్రం అని పిలిచే గేల్..టీ20 ఫార్మట్‌లో చెలరేగిపోతాడు. అంతేకాదు టెస్టు క్రికెట్లో ఇప్పటివరకు త్రిపుల్ సెంచరీ నమోదు చేసిన నలుగురు క్రికెటర్లలో గేల్ ఒకరు. మైదానంలో ఇప్పటివరకు చూడని షాట్లు…ఫూట్ మూవ్మెంట్ గేల్ బ్యాటింగ్‌లో ఎప్పటికప్పుడు దర్శనమిస్తుంటాయి. అవెప్పుడూ మనం చూసి ఉండం కానీ…బంతి మాత్రం స్టేడియం అంచుల్లో కనిపించడం సర్వ సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. ఇదే దూకుడుతో గేల్ ఐపిఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, పూణె వారియర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు.
సర్ వివ్ రిచర్డ్స్
ఆ పేరే చెప్తోంది సర్ వివ్ రిచర్డ్స్ గురించి…క్రికెట్ ఆది నుంచి దూకుడైన ఆటతీరును ప్రదర్శిస్తాడని. అంతర్జాతీయ క్రికెట్లో ఎలాంటి బంతినైనా సునాయాసంగా ఎదుర్కోగలడు. 1974లో టెస్టు క్రికెట్ ఆరంగట్రం చేసిన రిచర్డ్స్ రెండో టెస్టులోనే 192 పరుగులను నమోదు చేశాడు. ఇలా టెస్టుల్లో 8540 పరుగులు, వన్డేల్లో 6721 పరుగులు నమోదు చేశాడు. సర్ వివ్ బౌలింగ్ ఎలాంటిదైనా సరే…తన బాదుడు మాత్రం మారేది కాదట. అదెలా ఉండేదంటే స్టీరింగ్‌లా బ్యాట్‌ను పట్టుకొని వచ్చిన బంతిని బౌండరీలకు పంపించడమేనట. ఇంకా అతని కెరీర్లో హెల్మెట్ పెట్టుకుని ఆడిందేలేదట. ప్రస్తుత ఆటగాళ్లకు అతని ఆటతీరు ఇంకా ఆదర్శంగా ఉందంటే చెప్పుకోవచ్చు భయం లేని బ్యాట్స్‌మెన్ అని.