ప్రపంచ కప్ – 2019లో భాగంగా గత ఆదివారం పాక్తో జరిగిన మ్యాచ్లో భారత్ 89 పరుగుల తేడాతో విజయదుందుభి మోగించిన సంగతి తెలిసిందే. మ్యాచ్లో భాగంగా ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 336 పరుగులు చేసింది. ఓపెనర్లుగా క్రీజులోకి దిగిన రోహిత్ శర్మ పాకిస్తాన్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ సెంచరీ చేయగా, కే.ఎల్.రాహుల్ తనదైన శైలిలో బ్యాటింగ్ చేస్తూ జట్టుకు శుభారంభాన్ని అందించాడు.
ఆ తరువాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ సిక్సులు, ఫోర్లతో విజృంభిస్తూ క్రికెట్ అభిమానులను అలరించాడు. అదే సమయంలో మైదానంలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. ఈ విషయం ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ అసోసియేషన్ విడుదల చేసిన వీడియోతో బయటపడింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. పాక్ బౌలర్ ఇమాద్ వశీమ్ దండం పెడుతున్నట్టు ఉంది.
ఇక అసలు విషయానికొస్తే, గత ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో భారత్ నిర్దేశించిన 337 పరుగుల విజయ లక్ష్యాన్ని చేదించే క్రమంలో వరుణుడు పాకిస్తాన్కు పలుమార్లు అడ్డొచ్చిన సంగతి తెలిసిందే. దీంతో మ్యాచ్ నిర్ణేతలు డెక్లూయిస్ పద్ధతి ప్రకారం మ్యాచ్ను 40 ఓవర్లకు కుదించి 302 పరుగుల విజయ లక్ష్యాన్ని పాక్ముందు ఉంచింది. అయితే పాక్ మాత్రం 40 ఓవర్లకు ఆరు వికెట్లు కోల్పోయి 212 పరుగులు మాత్రమే చేయగలిగింది.
అయితే ఈ మ్యాచ్లో ఎంపైర్ ఔట్ అని ప్రకటించకుండానే విరాట్ కోహ్లీ బ్యాటింగ్ నుంచి వెనుదిరిగిన సంగతి తెలిసిందే. పాక్బౌలర్ వికెట్లకు బంతి వేయగా, దాన్ని బౌండరీ దాటించేందుకు కోహ్లీ యత్నించగా అది కుదరలేదు. ఆ బంతి నేరుగా వికెట్ కీపర్ చేతిలో పడింది. అదే సమయంలో శబ్దం రావడాన్ని గమనించిన కోహ్లీ బంతి బ్యాట్ తగిలిందేమో అని భావించి ఎంపైర్ ఔట్ అని డిక్లేర్ చేయకుండానే క్రీజును వదిలాడు.