Home Latest News బిగ్ బ్రేకింగ్ : కొడాలి నాని సంచ‌ల‌న నిర్ణ‌యం..!

బిగ్ బ్రేకింగ్ : కొడాలి నాని సంచ‌ల‌న నిర్ణ‌యం..!

గ‌త 35 సంవ‌త్స‌రాలుగా కృష్ణా జిల్లా ప‌రిధిలో ఉన్న అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా బాధ్య‌తలు నిర్వ‌హించిన వారెవ్వ‌రు కూడా మ‌ళ్లీ జ‌రిగిన ఎన్నిక‌ల్లో గెలుపొందిన దాఖ‌లాలు లేవ‌ని, అందుకుగ‌ల కార‌ణం ఇటీవ‌ల మంత్రి ప‌ద‌వి స్వీక‌రించిన త‌న‌కు తెలిసొచ్చింద‌ని కొడాలి నాని ఇటీవ‌ల గుడివాడ‌లో జ‌రిగిన వైసీపీ శ్రేణుల స‌మావేశంలో చెప్పారు.

తాను మంత్రి ప‌ద‌వి చేప‌ట్టి దాపు నెల రోజులు కావొస్తుందని, అప్ప‌ట్నుంచి త‌న నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల ప‌రిష్కారంపై దృష్టి సారించే అవ‌కాశం దొర‌క‌డం లేదని, ఇత‌ర జిల్లాల నుంచి వ‌చ్చేవారి స‌మ‌స్య‌లను ప‌రిష్క‌రించేందుకే త‌న‌కు స‌మ‌యం స‌రిపోతుంద‌న్నారు. దాంతో అస‌లు విష‌యం త‌న‌కు బోధ‌ప‌డింద‌ని, త‌న నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లకు స‌మ‌యం కేటాయించాల‌న్న ఉద్దేశంతో ప్ర‌తి రోజు రాత్రి స‌మ‌యం ఎంతైనా గుడివాడ‌కు వ‌స్తున్నాన‌ని, ఉద‌యం కూడా త‌న నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటున్నాన‌న్నారు.

గుడివాడ ప్ర‌జ‌లు త‌నను ఇప్ప‌టికే వ‌రుస‌గా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించార‌ని, వారంద‌రినీ దూరం చేసుకోవ‌డం ఇష్టంలేక‌నే ప్ర‌తి రోజు వారి స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం విజ‌య‌వాడ నుంచి గుడివాడ‌కు రాక‌పోక‌లు కొన‌సాగిస్తున్నాన‌న్నారు. అలానే ఐదోసారి ఎమ్మెల్యేగా గెల‌వ‌డం తాను చాలా ఛాలెంజ్‌గా భావిస్తున్నాన‌ని, ఐదోసారి గ‌నుక గెలుపొందితే ఇక ఎదురుండ‌ద‌ని, అందుకు పార్టీ శ్రేణులంతా ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు త‌న దృష్టికి తీసుకురావాల‌ని మంత్రి కొడాలి నాని పిలుపునిచ్చారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad