Home Latest News కేసీఆర్ రిట‌ర్న్ గిఫ్ట్ : నంద‌మూరి సుహాసినికి ఎమ్మెల్సీ ప‌ద‌వి..?

కేసీఆర్ రిట‌ర్న్ గిఫ్ట్ : నంద‌మూరి సుహాసినికి ఎమ్మెల్సీ ప‌ద‌వి..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌రికొన్ని రోజుల్లో సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడుకు ఇవ్వ‌నున్న రిట‌ర్న్ గిఫ్ట్‌పైనే అంద‌రి దృష్టి మ‌ళ్లింది. రిట‌ర్న్ గిఫ్ట్ ఎప్పుడిస్తాడు..? ఎలా ఇస్తాడు..? వ‌స్తురూపంలోనా..? లేక రాజ‌కీయాల ప‌రంగానా..? అన్న ప్ర‌శ్న‌లు తెలుగు ప్ర‌జ‌లను తొల‌చివేస్తున్నాయి.

అయితే, గ‌త సంవ‌త్స‌రం డిసెంబ‌ర్‌లో జ‌రిగిన ముంద‌స్తు ఎన్నిక‌ల్లో తెరాస ఘ‌న విజ‌యం త‌రువాత మొద‌టిసారిగా కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. దేశ రాజ‌కీయాల‌ను బాగుచేసే క్ర‌మంలో తెలుగు ప్ర‌జ‌ల గౌర‌వం పెర‌గాలంటే అంద‌రం త‌ప్ప‌కుండా క‌లిసి ప‌నిచేయాల్సిన అవ‌స‌రం ఉందని, ఆ మేర‌కు క‌లిసి ప‌నిచేస్తామ‌ని, చంద్ర‌బాబు వ‌చ్చి తెలంగాణ‌లో ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించారు.. అలాగే మేము పోయి అక్క‌డ ప‌నిచేయొద్దా..? ఆ అర్హ‌త మాకు లేదా..? అంటూ కేసీఆర్ చ‌మ‌త్క‌రించిన సంగ‌తి తెలిసిందే.

అంతేకాకుండా, మ‌నం పుట్టిన రోజు జ‌రుపుకున్నప్పుడు గిఫ్ట్ ఇచ్చిన వాళ్ల‌కు రిట‌ర్న్ గిఫ్ట్ ఇయ్య‌మా..? ఏం అల్ల‌మ‌న్నా ఇయ్యాల్నా…? వ‌ద్దా.?? రిట‌ర్న్ గిఫ్ట్ ఇవ్వ‌కుంటే త‌ప్ప‌వ‌దుతుంది మ‌రీ..! చంద్ర‌బాబు నాయుడ‌కు రిట‌ర్న్ గిఫ్ట్ ఇవ్వ‌లేద‌నుకో తెలంగాణ వాళ్లు సంస్కార హీనులు అంటారు మ‌ళ్లా, కాబ‌ట్టి హండ్రెడ్ ప‌ర్సెంట్ చంద్ర‌బాబు నాయుడ‌కు రిటర్న్ గిఫ్ట్ ఉంటుంది. దాని ఫ‌లితం చంద్ర‌బాబు నాయుడు అనుభవిస్తాడు అంటూ సీఎం కేసీఆర్ మీడియా మిత్రుల‌తో చెప్పిన విష‌యం విధిత‌మే.

ఇక అస‌లు విష‌యానికొస్తే, కేసీఆర్ చంద్ర‌బాబుకు ఇవ్వ‌నున్న రిట‌ర్న్ గిఫ్ట్ నంద‌మూరి సుహాసిని రూపంలో ఉండ‌బోతుందంటూ తెరాస శ్రేణుల్లో జోరుగా చ‌ర్చ జ‌రుగుతోంది. అయితే, నందమూరి సుహాసిని తెలంగాణ ముంద‌స్తు ఎన్నికల్లో కూకట్‌ప‌ల్లి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థినిగా పోటీ చేసి ఘోర ఓట‌మిని చ‌విచూసింది.

ఈ నేప‌థ్యంలో చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వకపోతే ఎలా అన్న కేసీఆర్‌, ఏపీ రాజకీయల్లో వేలు పెడతామ‌న్న తెరాస కేడ‌ర్ సుహాసినిని పార్టీలో చేర్చుకునేందుకు పాలువు క‌దుపుతోందంటూ, ఈ క్ర‌మంలోనే సుహాసిని త్వరలోనే తెరాస‌లో చేరబోతున్నారన్న‌ చర్చ ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అయింది.

కేసీఆర్ తానెంతో అభిమానించే ఎన్టీఆర్ కుటుంబానికి చెందిన సుహాసినిని టీఆర్ఎస్‌లోకి ఆహ్వానించి ఆమెను ఎమ్మెల్సీగా శాస‌న మండ‌లికి పంపించే ఆలోచనలో ఉన్నార‌ని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. సుహాసిని గులాబీ కండువా వేసుకొని శాసన మండలికి వెళితే ఏపీలో అడుగుపెట్టకుండానే ఏపీ సీఎం చంద్రబాబు ఇమేజ్ ని డ్యామేజ్ చేసినట్టు అవుతుందని టీఆర్ఎస్ అధిష్టానం ఆలోచన చేస్తునట్టుగా ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో చర్చ జోరుగా సాగుతోంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad