Home Latest News రెవెన్యూ చట్టంలో సంచలన మార్పులకు బీజం వేసిన CM కేసీఆర్

రెవెన్యూ చట్టంలో సంచలన మార్పులకు బీజం వేసిన CM కేసీఆర్

తెలంగాణ రాష్ట్రంలోని రెవెన్యూ చట్టంలో సంచలన మార్పులకు పునాది రాయి వేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్. రెవెన్యూ చట్టంలో సమూల మార్పులు తప్పవని పేర్కొన్న ఆయన.. నేడు తెలంగాణ భవన్‌ లో TRS విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా, మండల పరిషత్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఆసిఫాబాద్ జడ్పీ చైర్ పర్సన్‌ గా “కోవా లక్ష్మి” పేరును ఖరారు చేసిన కేసీఆర్.. మిగతా స్థానాలకు సంబంధించిన పేర్లను త్వరలో ఖరారు చేయనున్నారు.

ఈ సందర్భంగా మాట్లాడినా ముఖ్యమంత్రి..  లోక్‌సభ ఎన్నికల్లో 16 స్థానాలను గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్రంలో మొత్తం 32 జడ్పీ, 530కి పైగా మండల పరిషత్ స్థానాలను కైవసం చేసుకోవాలని నాయకులకు సూచించారు. జిల్లా పరిషత్‌ లకు సంబంధించి సీనియర్ నేతలకు, మండల పరిషత్‌లకు సంబంధించి ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించారు.

అలాగే రెవెన్యూ వ్యవస్థ రద్దుకు సంబంధించి సీనియర్ నేతల అభిప్రాయాలను కేసీఆర్ సేకరించినట్టు తెలుస్తోంది. అయితే ఈ వ్యవస్థలో చాలా లోపాలున్నాయని.. వాటి స్థానంలో కొత్త చట్టం తీసుకురావడం మంచిదని నేతలు సూచించినట్టు తెలుస్తోంది. ఈ క్షణం నుండి జిల్లా, మండల పరిషత్ ఏర్పాట్లన్నీ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని కేసీఆర్ నేతలకు సూచించారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad