ప్రజల సొమ్ముతో నిర్మించిన ప్రజావేదిక సీఎం జగన్ మోహన్‌రెడ్డి, మాజీ సీఎం చంద్రబాబు ఆస్తి కాదని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ అన్నారు. రూ.8 కోట్లు ఖర్చుపెట్టి మరీ నిర్మించిన ప్రజావేదిక భవనాన్ని కూల్చేయడంకంటే ప్రజా అవసరాల కోసం వినియోగించి ఉంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు.
అలాగే కేసులు ఉన్న వారిని బీజేపీ చేర్చుకుంటుందన్న విమర్శలను కన్నా లక్ష్మీ నారాయణ ఖండించారు. చాలా మందిపై కేసులు ఉన్నా అవి నిరూపితం కాలేదని స్పష్టం చేశారు. అవినీతిపరులపై చర్యలు తీసుకునే విషయంలో సీఎం జగన్ మోహన్‌రెడ్డికి తామంతా పూర్తిగా సపోర్టు చేస్తామని చెప్పారు.