ఫిల్మ్ ఇండస్ట్రీ లో గత కొంత కాలంగా బయోపిక్ ల హవా కొనసాగుతోంది. ఆ పరంగానే తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి, నటి జయలలిత జీవిత చరిత్రను తెరకెక్కించాలనుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం తమిళ ప్రజలంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తమిళ ప్రజలు జయలలితను ‘పురుచ్చి తలైవి’ గా పిలుచుకుంటారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెల్లడించారు దర్శకులు. తమిళ దర్శకులలో ప్రముఖులైన ఎ.ఎల్. విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. జయలలిత పాత్రలో కంగనా నటిస్తున్నట్లు, మార్చి 23న ఆమె జన్మదినము సందర్భంగా తెలిపారు.
‘బాహుబలి’ రచయిత విజేంద్రప్రసాద్ ఈ సినిమాకు కథను అందిస్తున్నారు. అదే విధంగా ఈ మధ్య విడుదలైన ‘మణికర్ణిక’ చిత్రానికి కూడా విజయేంద్రప్రసాద్ స్క్రిప్టు అందించారు. ఇప్పుడు మరోసారి కంగనారనౌత్ విజయేంద్ర ప్రసాద్ కలిసి పనిచేస్తున్నారు. ఈ సినిమాను తమిళ్, హిందీ భాషలలో ప్రేక్షకులకు అందిస్తున్నారు. తమిళంలో ‘తలైవి’, హిందీలో ‘జయ’ టైటిల్స్ తో ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారు. విబ్రి, కర్మ మీడియా ఎంటర్టైన్మెంట్ పతాకం పై రాబోతున్న సినిమాకు విష్ణు వర్ధన్ ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్ నిర్మాణ బాధ్యతలు చేపడుతున్నారు.
ఈ నేపథ్యంలో దర్శకుడు విజయ్ మాట్లాడుతూ ‘దేశములో ప్రముఖ నేతల్లో ఒకరైన అలనాటి నటి జయలలిత జీవిత చరిత్రను చిత్రంగా ప్రేక్షకులకు అందించాలనుకున్నాను. లెజెండ్ లీడర్ జయలలిత జీవితం ఎంతో మందికి ఆదర్శం. ఈ ప్రాజెక్ట్ ను ఎంతో జాగ్రత్తతో, నిజాయితీతో నిర్మించాలనుకుంటున్నాం. ఎంతో ప్రతిభావంతమైన పాత్రలో కంగనా రనౌత్ లాంటి మల్టీ టాలెంటెడ్ స్టార్ నటించడం చాలా ఆనందకరమైన విషయం.. ఈ పాత్రలో కంగనా తప్పక న్యాయం చేస్తుందని’ చెప్పుకొచ్చారు.
కంగనా రనౌత్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో నటించే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రాజెక్ట్ లో నేను బాగామవడం గర్వాంగా ఉంది. దేశం లో గొప్ప విజయవంతమైన మహిళలో జయలలిత ఒకరు. గొప్పనటి .. రాజకీయవేత్త’ .అంటూ రనౌత్ సంతోషాన్ని వ్యక్తం చేసారు. సినిమా అతి త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.