కథ,కథనం :
గరుడవేగ సినిమా తరువాత రాజశేఖర్ హీరోగా నటించి మెప్పించిన సినిమా కల్కి. ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ఫస్ట్ లుక్ విడుదలైనప్పటి నుంచే భారీ అంచనాలు ఏర్పడిన సంగతి తెలిసిందే. హీరో రాజశేఖర్ పని అయిపోయిందన్న వారంరి నోళ్లను మూయించిన సినిమా గరుడవేగ, ఈ సినిమా రాజశేఖర్ కెరీర్లోనే మంచి వసూళ్లను రాబట్టి సూపర్‌హిట్ టాక్‌ను కూడా సొంతం చేసుకుంది. దీంతో గరుడవేగ తరువాత వస్తున్న సినిమా కనుక కల్కిపై సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఏర్పడ్డాయి. అంచనాలకు తగ్గట్టే నిర్మాతలు కూడా సినిమాను భారీఎత్తున రిలీజ్ చేశారు.
కల్కి మంచి యాక్షన్ థ్రిల్లర్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సినిమాతో హీరో రాజశేఖర్ మంచి కమ్‌బ్యాక్ ఇచ్చారని చెప్పొచ్చు. హీరో రాజశేఖర్ కల్కిగా సినీ ప్రేక్షకులను అలరించారనే చెప్పాలి. కథ విషయానికొస్తే, కొల్లపూర్ అనే గ్రామంలో ఎమ్మెల్యే తమ్ముడిని అతి దారుణంగా హత్య చేస్తారు. దాని వల్ల ఆ ఏరియాలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పుతుంది. ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా, ఎమ్మెల్యే తమ్ముడ్ని ఎవరు చంపుతారో తెలుసుకునేందుకు ఐపీఎస్ ఆఫీసర్ కల్కిని నియమిస్తారు. అక్కడ్నుంచి కల్కి క్యారెక్టర్లో హీరో రాజశేఖర్ అదరగొట్టాడనే చెప్పాలి.
మంచి యాక్షన్ సినిమాను కమర్షియల్‌గా మలచడంలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. అ సినిమాతో తనేంటో నిరూపించుకున్న ప్రశాంత్ వర్మ కల్కితో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక సినిమాలో కొన్ని సన్నివేశాలు ప్రముఖ దర్శకుడు రాజమౌళి తీశాడేమో అన్నట్టు ఉన్నాయి. స్త్రీన్ ప్లే, కెమెరా టేకింగ్, క్లోస్ షాట్స్ సినిమాను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లాయి.
ఇక ఈ సినిమాలో మరో ప్లస్ పాయింట్ శ్రావణ్ భరద్వాజ్ మ్యూజిక్. మంచి క్లాసీ మ్యూజిక్‌తో, అలాగే థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌కు కనెక్ట్ అయ్యేలా ఉంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే అద్భుతమనే చెప్పాలి. ఆదాశర్మ, అశుతోష్ రాణా వారి వారి క్యారెక్టర్స్ పరిధిలో నటించారు. హీరో రాజశేఖర్ గరుడవేగ తరువాత కల్కి సినిమాతో మంచి భారీ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.
రేటింగ్ – 3/5