గతకొన్ని రోజులుగా సంచలనం సృష్టిస్తున్న మంగళగిరి “జ్యోతి హత్య” కేసులో సంచలన నిజం బయటపడింది. ముందునుండి జ్యోతి కుటుంబ సభ్యులతో పాటు పోలీసులు కూడా అనుమానిస్తున్నట్లుగానే జ్యోతిని తన ప్రియుడు శ్రీనివాసే హత్యచేశాడని నిర్దారణ అయ్యింది.. ముందు నుండే ఒకప్పుడు సినీ నటి ప్రత్యూష హత్యను తలపించేలా జ్యోతి హత్య కనిపిస్తూ వస్తుంది. కానీ రాజధాని సమీపంలో ఉన్న ఆ ప్రాంతంలో తాగి ప్రేమికులను ఇబ్బంది పెట్టె ముఠాలు ఉన్నాయన్న ఒకే ఒక కారణంతో పోలీసులు ముందుగా కేసును ఆ కోణంలో చూశారు.
కానీ సరైన ఆధారాలు ఎక్కడ దొరకలేదు.. పోలీసుల ఆలోచనలు ఎక్కడికి వెళ్ళిన చివరికి శ్రీనివాస్ దగ్గరే ఆగిపోతున్నాయి.. కారణం అతడు చెప్పే వివరాలు సరిగ్గా లేకపోవడమే.. మొదటిరోజు ఒక 4 వ్యక్తులు మాపై దాడిచేశారు అని చెప్పిన శ్రీనివాస్, నన్నపనేని రాజ్ కుమార్ గారు వచ్చినప్పుడు ముగ్గురే దాడి చేశారు అని చెప్పాడు. ఆతరువాతే మరుసటిరోజు పోలీసులు ప్రశ్నిస్తే ఇద్దరు దాడిచేశారు. పైగా వాళ్ళు ముసుగులు దరించి ఉన్నారు అని చెప్పాడు.
అప్పుడే పోలీసుల అనుమానం మరింత బలపడింది.. పైగా త్వరగానే కోలుకోవాల్సిన శ్రీనివాస్ ఇంకా నా ఆరోగ్యం సరిగా లేదు అని భయపడుతూ సామదానం చెప్పకుండా దాటవేయడం మొదలు పెట్టాడు. అంతే పోలీసులకు పూర్తి నిర్దారణ వచ్చింది.. బయట తిరగడం దండగా మొత్తం ఇక్కడే ఉంది అని తమదైన స్టైల్లో శ్రీనివాస్ ని విచారిస్తే అసలు నిజం చెప్పేశాడు శ్రీనివాస్.
గత కొంతకాలంగా తనను వివాహం చేసుకోవాలని జ్యోతి ఒత్తిడి తేవడంతో ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలనే ఈ హత్య చేశానని ఒప్పేసుకున్నాడు శ్రీనివాస్.. హత్య తరువాత ఎలా తప్పించుకోవాలి అని క్రైమ్ సినిమాను తలపించేలా పక్కా స్కెచ్ వేసినా ఫలితం లేకపోయింది. పోలీసు దర్యాప్తు ముందు నిందితుడు తలవంచక తప్పలేదు. దర్యాప్తులో జ్యోతిని హత్య చేసింది ప్రియుడు శ్రీనివాసరావేనని తేల్చారు పోలీసు. శ్రీనివాస్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి పక్క ప్లాన్ వేసి జ్యోతిని హతమార్చినట్లు దర్యాప్తులో వెల్లడైంది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు పోలీసులు.