Home Latest News జీవిత రాజశేఖర్ వర్సెస్ కౌశిక్ రెడ్డి.. తప్పు ఎవరిదీ ?

జీవిత రాజశేఖర్ వర్సెస్ కౌశిక్ రెడ్డి.. తప్పు ఎవరిదీ ?

జీవిత రాజశేఖర్ పెయిర్ బ్రాండ్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె విషయంలో ఎవ్వరు ఏ చిన్న తప్పు చేసిన ఆమె అస్సలు క్షేమించదు. న్యాయం జరిగేవరకు ఎంత దూరమైనా వెళ్తాను అంటూ శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది. అలాంటి జీవితా గారికి మరోసారి కోపం వచ్చింది. ఆ కోపానికి కారణం ఓ కాంగ్రెస్ MLA అభ్యర్థి కావడంతో ఈ న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

వివరాల్లోకి వెళ్తే.. జీవిత రాజశేఖర్ మరిది, ఆంటే రాజశేఖర్ గారి సోదరుడు అయినా గుణశేఖర్ కి జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 45 లో “గుణాస్ డైమండ్స్” అని డైమండ్స్ షో రూమ్ ఉంది. ఆ షో రూమ్ ముందు అనుమతి లేకుండా తన కార్ పార్క్ చేసిన కౌశిక్ రెడ్డి అనే పొలిటిషన్ ఇదేంటి ? అని ప్రశ్నించినందుకు నన్నే ప్రశ్నిస్తావా ? అంటూ గుణశేఖర్ పై దాడి చేసాడని జీవిత రాజశేఖర్ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో అతడిపై కేసు నమోదు చేసింది.

అనంతరం మీడియాతో మాట్లాడిన జీవిత తన మరిదిది ఏ తప్పు లేకుండానే అతడిపై దుర్భాషలాడుతూ పీకసికి దాడి చేసాడని, ఎదురు తిరిగితే అవును మేము ఇలాగే చేస్తాం, నీ షో రూమ్ ని కూల్చేస్తాం ఏం చేస్తావ్ అని బెదిరించాడని, తీరా ఆ మహానుభావుడు ఎవరు అని ఆరా తీస్తే.. గత ఎన్నికల్లో “ఉజురాబాద్ నియోజకవర్గం” నుండి పోటీ చేసి ఓడిపోయినా “కౌశిక్ రెడ్డి” అని తెలిసిందని, ఇలాంటి వారిని కాంగ్రెస్ ఎందుకు తన పార్టీలో చేర్చుకుందో ప్రశ్నిస్తానని.. ఉత్తమ్ కుమార్, బట్ట విక్రమార్కలు నాకు బాగాతెలుసాని న్యాయం జరిగేవరకు పోరాడుతా అంటూ మీడియాకు వివరించారు జీవితా.

ఇక్కడివరకు కథ ఒకలా ఉంటె జీవిత ప్రెస్ మీట్ తరువాత కథ అడ్డం తిరిగింది.. అదే జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కి వెళ్లిన “కౌశిక్ రెడ్డి” అక్కడ నా తప్పేమి లేదాని.. నిజానికి అతడే నన్ను రెచ్చగొట్టి చేయి చేసుకున్నాడని, ఆ కారణంగానే నేను అతడిని తోసాను తప్ప అతడిపై దాడి చేయలేదు.. కావాలంటే ఆ CC పోటేజ్ ని జాగ్రత్తగా చూడాలని జీవితపై తిరుగు కేసు పెట్టాడు.. నిజా నిజాలు తెలుసుకోకుండా ఆ స్పాట్ లో లేని జీవిత ఎవరో చెప్పింది నమ్మి అందరి ముందు నా పరువు తీసింది. ఆమెకు కేవలం పబ్లిసిటీ కావలి అందుకోసం ఎవరినైనా టార్గెట్ చేస్తుంది.. ఇప్పుడు నేను దొరికాను అంతే అంటూ ఆమెపై తిరగబడ్డాడు. మరీ ఈ కేసులు అసలు తప్పు ఎవరిదీ ? అనే విషయాన్నీ తేల్చే పనిలో పడ్డారు పోలీసులు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad