Home Latest News ఇట్స్ వైర‌ల్ : జ‌గ‌న్, మ‌హేష్‌ల‌పై ఈ వార్త నిజ‌మేనా..!

ఇట్స్ వైర‌ల్ : జ‌గ‌న్, మ‌హేష్‌ల‌పై ఈ వార్త నిజ‌మేనా..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి శుక్ర‌వారం నాడు హైద‌రాబాద్ న‌గ‌ర ప‌రిధిలోగ‌ల ఏసియ‌న్ మ‌హేష్‌బాబు మ‌ల్టీప్లెక్స్‌లో కుటుంబ స‌మేతంగా అవెంజ‌ర్స్ మూవీని చూసిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన అవెంజ‌ర్స్ మూవీని చూసేందుకు వైఎస్ జ‌గ‌న్ త‌న కుటుంబంతో స‌మేతంగా వ‌స్తున్నాడ‌న్న ముంద‌స్తు స‌మాచారం అంద‌డంతో, అందుకు త‌గ్గ ఏర్పాట్ల‌ను థియేట‌ర్ యాజ‌మాన్యం చేసింది.

జ‌గ‌న్ కుటుంబం ఎటువంటి ఇబ్బందులు ప‌డ‌కుండా అవెంజ‌ర్స్ మూవీని చూసేందుకు థియేట‌ర్ యాజ‌మాన్యం ఏర్పాటు చేసే క్ర‌మంలో ఏఎంబీలోని స్క్రీన్ 5లో ఉన్న లిమిటెడ్ సీట్ల‌ను బ్లాక్ చేసిన‌ట్టు తెలుస్తుంది. వైఎస్ జ‌గ‌న్ వ‌చ్చాడ‌న్న స‌మాచారం తెలుసుకుని ఆయ‌న అభిమానులు వ‌చ్చి ఫోటోలంటూ ఎటువంటి ఇబ్బందులకు గురి చేయ‌కుండా గ‌ట్టి భ‌ద్ర‌తా చ‌ర్య‌లు తీసుకున్నారు.

ముందస్తు స‌మాచారం మేర‌కు ఏంఎంబీ స్క్రీన్ 5లోని సీట్ల‌న్నీ బ్లాక్ చేసినా వైఎస్ జ‌గ‌న్ ఫ్యామిలీకి సంబంధించి అతికొద్ది మందే అవేంజర్స్ మూవీ చూశారు. అంతేకాక, జ‌గ‌న్ తన ఫ్యామిలీతోపాటు త‌న‌కు అత్యంత స‌న్నిహితుడైన ఓ బిల్డ‌ర్‌తో సినిమాను వీక్షించేందుకు వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. కుటుంబ స‌మేతంగా వ‌చ్చిన వైఎస్ జ‌గ‌న్‌ను ఏఎంబీ భాగ‌స్వామి అయిన సునీల్ నార‌ణ్ స్వాగ‌తం ప‌లికారు.

ఇదిలా ఉండ‌గా, వైఎస్ కుటుంబంతో టాలీవుడ్‌ సూప‌ర్‌స్టార్ కృష్ణ‌ కుటుంబానికి అత్యంత స‌న్నిహిత సంబంధాలు ఉన్న సంగ‌తి తెలిసిందే. దివంగ‌త సీఎం వైఎస్ఆర్ హ‌యాంలో సూప‌ర్ స్టార్ కృష్ణ‌కు స‌హాయ స‌హ‌కారాలు అందించార‌న్న టాక్ అటు రాజ‌కీయ వ‌ర్గాల‌తోపాటు, సినీ ఇండ‌స్ట్రీలోనూ ఇప్ప‌టికీ వినిపిస్తుంటుంది. ఇలా ఇరు కుటుంబాల మ‌ధ్య ఏర్ప‌డ్డ సాన్నిహిత్యం నేటికి కొన‌సాగుతోంద‌ని చెప్ప‌డంలో ఎటువంటి సందేహం లేదు. ఆ క్ర‌మంలో తాను భాగ‌స్వామిగా ఉన్న ఏఎంబీ మాల్‌కు వైఎస్ జ‌గ‌న్ కుటుంబం వ‌స్తుంద‌ని తెలుసుకున్న సూప‌ర్ స్టార్ ఏర్పాట్లన్నీ స‌క్ర‌మంగా ఉండేలా చూసుకోమ‌ని సునీల్ నార‌ణ్‌కు సూచించిన‌ట్టు ఓ వార్త ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad