
భారత్-చైనా సరిహద్దు వద్ద మళ్లీ ఉధ్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఇరు దేశాలు తమ సైన్యాన్ని అప్రమత్తం చేశాయి. ఇటీవల రెండు దేశాల సైనికుల మధ్య ఘర్షణ చోటుచేసుకోగా, పెద్ద సంఖ్యలో భారత జవాన్లు మృతిచెందారు. దీంతో భారత్-చైనా సరిహద్దులో నిఘాను అప్రమత్తం చేశారు. అయితే చైనా తమ వైఖరిని ఏమాత్రం మార్చుకోకపోవడంతో భారత ప్రభుత్వం దానికి బుద్ధి చెప్పాలని చూస్తోంది.
ఈ క్రమంలోనే ఇటీవల చైనాకు చెందిన 59 యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధించింది. అయితే ఇప్పుడు మళ్లీ పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో మరోసారి చైనా చెంప చెళ్లుమనిపించింది. ఈసారి ఏకంగా 118 యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధించింది. దీంతో చైనా ఉక్కిరి బిక్కిరి అవుతుంది. కాగా ఈ యాప్‌లలో యువతతో పాటు అన్ని వయసుల వారిని బానిసలుగా మారుస్తున్న పబ్జీ ఆటన కూడా కేంద్రం చేర్చింది. దీంతో చైనాకు గట్టి దెబ్బ తగిలిందనే చెప్పాలి.
చైనా దేశంపై డిజిటల్ యుద్ధం ప్రకటించిన భారత్, ఆ దేశానికి చెందిన యాప్‌లను వరుసగా బ్యాన్ చేస్తూ వస్తోంది. మరి ఇప్పటికైనా చైనా తన బుద్ధిని మార్చుకుంటుందా లేదా అనేది ఆసక్తిగా మారింది. ఏదేమైనా చైనా యాప్‌లను నిషేధించి ఆ దేశాన్ని ఆర్ధికంగా దెబ్బకొట్టాని భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. మరి ఈ అంశం ఇంకా ఎక్కడి వరకు వెళ్తుందో, ఇంకా ఏయే యాప్‌లను కేంద్రం బ్యాన్ చేస్తుందో చూడాలి.