Home Latest News “గూగుల్‌ పే” అధికారిక యాప్ కాదా ?

“గూగుల్‌ పే” అధికారిక యాప్ కాదా ?

మని ట్రాన్స్పర్ అనగానే ఈమద్య ఎక్కువ మంది “గూగుల్‌ పే” యాప్ నే ఉపయోగిస్తున్నారు. ఈ పేమెంట్‌ యాప్‌ గురించి తెలియని వారుండరు. అలాంటి ఈ యాప్‌ ను రిజర్వ్‌ బ్యాంక్‌ ధ్రువీకరించలేదంటూ డిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. దీంతో “గూగుల్‌ పే” అధికారికమైన యాప్ కాదా ? అనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.

అసలు విషయానికి వస్తే.. “గూగుల్‌ పే” యాప్‌ పై “అభిజిత్‌ మిశ్రా” అనే వ్యక్తి డిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ యాప్‌ పేమెంట్స్‌ అండ్‌ సెటిల్‌మెంట్స్‌ చట్టాన్ని ఉల్లంఘించిందని.. నగదు బదిలీలు చేసేందుకు ఈ యాప్‌ కు కేంద్ర బ్యాంకు నుంచి సరైన ధ్రువీకరణ లేదని అభిజిత్‌ మిశ్రా ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇదేకాక ఈ ఏడాది మార్చి 20న RBI విడుదల చేసిన అధికారిక “పేమెంట్‌ సిస్టమ్‌ ఆపరేటర్స్‌” జాబితాలో “గూగుల్‌ పే” పేరు లేదని పిటిషన్ వేశాడు.

ఈ పిటిషన్‌ పై దర్యాప్తు చేపట్టిన న్యాయస్థానం.. అధికారిక ధ్రువీకరణ లేకుండానే “గూగుల్‌ పే” యాప్‌ కార్యకలాపాలను ఎలా సాగిస్తోందని RBI ని ప్రశ్నించింది. ఈ పిటిషన్‌పై వెంటనే వివరణ ఎవ్వలని ఆర్‌బీఐతో పాటు “గూగుల్‌ ఇండియా”కు కూడా నోటీసులు జారీ చేసింది. ఈ వార్త చూసిన “గూగుల్‌ పే” యాజర్లు అయోమయంలో పడ్డారు. ఇలాంటి సమయంలో పేమెంట్స్ చేస్తే ఇబ్బందులు ఎదురవుతాయా ? అని ఆలోచనలో పడిపోయారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad