
తెలంగాణలో కరోనా వైరస్ రోజురోజుకూ విజృంభిస్తూ వస్తోంది. ఇప్పటికే ఇక్కడి ప్రజలు కరోనా వైరస్ బారిన పడుతూ నానా అవస్థలు పడుతుండగా, పలువురు ప్రజాప్రతినిధులు కూడా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఈ వైరస్ బారిన పడిన చాలా మంది ప్రాణాలతో బయటపడేందుకు కష్టపడుతున్నారు. కాగా తాజాగా తెలంగాణ ఆర్ధిక మంత్రి హరీష్ రావు కరోనా బారిన పడ్డారు. ఈ వార్తతో ఒక్కాసారిగా తెలంగాణ ప్రజలు ఉలిక్కిపడ్డారు.
ఎప్పుడూ ప్రజాసేవలో ముందుండే మంత్రి హరీష్ రావు, సిద్ధిపేట నియోజవర్గం ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా కరోనా వైరస్ నుండి తన నియోజకవర్గ ప్రజలను సురక్షితంగా ఉంచేందుకు ఆయన శ్రమిస్తున్నారు. అయితే ఆయనకు స్వల్పంగా కరోనా లక్షణాలు కనిపించడంతో ఆయన పరీక్ష చేయించుకున్నారు. కానీ ఆ పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు.
ఇక తనకు కరోనా సోకిందని, అందరూ తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని, కరోనా టెస్టులు చేయించుకుంటే మంచిదని హరీష్ రావు సోషల్ మీడియా వేదికగా కోరారు. కరోనా సోకిన వారు ఐసోలేషన్‌లో ఉండాలని ఆయన కోరారు. ఇక హరీష్ రావుకు కరోనా రావడంతో అందరూ ఆయన త్వరగా కోలుకోవాలని కోరుతున్నారు. సిద్దిపేట ప్రజలు హరీష్ రావు త్వరగా కోలుకుని, తిరిగి తమ బాగోగులు చూసుకోవాలంటూ ఆయన పేరిట ప్రత్యేక పూజలు చేస్తున్నారు.