Home Latest News వెంటపడినా ఒప్పుకోలేదని నరికేశాడు..!

వెంటపడినా ఒప్పుకోలేదని నరికేశాడు..!

ప్రేమిస్తున్నానన్నాడు. గత కొంత కాలంగా వెంట పడ్డాడు. ప్రేమించమని వేధించాడు. చివరికి  తనని ప్రేమించట్లేదని అమ్మాయిని చంపడానికి కూడా వెనకాడలేదు ఓ ప్రేమోన్మాది. హైదరాబాద్  బర్కత్ పురా లో ప్రేమోన్మాది దాడి  కలకలం రేపింది.

భరత్ అనే యువకుడు కొన్నాళ్లుగా మధులిక అనే విద్యార్థిని ప్రేమిస్తున్నాని వెంట పడ్డాడు. కానీ అమ్మాయి అతడి ప్రేమను నిరాకరించింది. అయినా వెంట పడి వేధిస్తూనే ఉన్నాడట. చివరకు తల్లి దండ్రులకు తన భాదను వెల్లడించింది. అతనికి మధులిక తండ్రి నచ్చ చెప్పాడు. కానీ అతడి ఆగడాలు ఆగలేదు. చివరకు కోపంతో రగిలిపోయాడు భరత్. ఆమెను మాటు వేసి మరి కత్తి వేటువేశాడు.

మధులిక బర్కత్ పురలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది. రోజు పరంగానే కాలేజ్ కోసం ఇంటి నుండి బయలు తేరింది. భరత్ ఆమెను వెంబడించాడు. ప్లాన్ ప్రకారం బర్కత్ పురలో నడి రోడ్డు మీద విద్యార్ధిని పై కొబ్బరి బొండాల కత్తితో దాడి చేశాడు. మధులిక తీవ్రమైన గాయాలపాలయింది. అక్కడి స్థానికులు పోలీసులకు పిర్యాదు చేయగా హుటాహుటిగా అక్కడికి చేరుకున్న పోలీసులు, తీవ్రంగా గాయపడిన యువతిని, మలక్ పేట యశోద ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అమ్మాయి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. మలక్ పేట యశోద ఆసుపత్రికి లో అమ్మాయికి చికిత్స పొందుతుంది. ఈ ఘటన పై పోలీసులు నిందితుడు భరత్  మీద  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad