Home Latest News జ‌న్మ‌భూమి నుంచి సీఎం వ‌ర‌కు అంద‌రూ దోపిడీ దారులే : క‌న్నా

జ‌న్మ‌భూమి నుంచి సీఎం వ‌ర‌కు అంద‌రూ దోపిడీ దారులే : క‌న్నా

ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నుంచి.. స్వ‌యాన చంద్ర‌బాబు ఆధ్వ‌ర్యంలోనే న‌డుస్తున్న జ‌న్మ‌భూమి క‌మిటీల వ‌ర‌కు దోపిడీ దారులేన‌ని ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీ నారాయ‌ణ అన్నారు. కాగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఇవాళ ఏపీలో ప‌ర్య‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. మోడీ త‌న ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఇప్ప‌టికే ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను ప్రారంబించారు.

కృష్ణ‌ప‌ట్నం కోస్ట‌ల్ ఇన్‌స్ట‌లేష‌న్‌కు ప్ర‌ధాని మోడీ శంకుస్థాప‌న చేశారు. అలాగే చమురు, స‌హ‌జ‌వాయులకు సంబంధించి మూడు ప్రాజెక్టుల‌ను మోడీ జాతికి అంకితం చేశారు. అలాగే ఎస్1 వ‌శిష్ట డెవెల‌ప్‌మెంట్ ప్రాజెక్టును మోడీ జాతికి అంకితం చేశారు.

ఈ సంద‌ర్భంగా గుంటూరు జిల్లా ప‌రిధిలోగ‌ల ఏటుకూరులో నిర్వ‌హించిన బీజేపీ భారీ బ‌హిరంగ స‌భ‌లో క‌న్నా ల‌క్ష్మీ నారాయ‌ణ పాల్గొని ప్ర‌సంగించారు. రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణానికి కేంద్ర ప్ర‌భుత్వం వేల కోట్ల రూపాయ‌ల నిధుల‌ను కేటాయించింద‌ని, కానీ ఆ విష‌యం బ‌య‌ట‌కు రాకుండా సీఎం చంద్ర‌బాబు, ఆయ‌న మంత్రి వ‌ర్గం అన్ని విధాలా అడ్డుకుంటున్నార‌న్నారు.

సీఎం చంద్ర‌బాబు పాల‌న‌లో ప్ర‌జ‌లు అనేక ఇబ్బందుల‌ను ఎదుర్కొంటున్నార‌ని, వారి ఇబ్బందులను ఓట్ల రూపంలో మ‌లిచి ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టేందుకు ప్ర‌జ‌లు సిద్దంగా ఉన్నార‌న్నారు. రాజ‌ధానిలో అద్భుత క‌ట్ట‌డాలు నిర్మిస్తామ‌ని చెప్పిన చంద్ర‌బాబు పేద ప్ర‌జ‌ల భూముల‌ను బ‌ల‌వంతంగా లాక్కున్నార‌న్నారు. అటువంటి చంద్ర‌బాబు నాయుడు దేశం గ‌ర్వించే మోడీని విమ‌ర్శించడం హాస్యాస్ప‌ద‌మ‌న్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad