Home Latest News తెలంగాణ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరుతో మోసాలు.. వందల మందిని ముంచేసిన దళారులు

తెలంగాణ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరుతో మోసాలు.. వందల మందిని ముంచేసిన దళారులు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మకమైన “డబుల్ బెడ్ రూమ్ ఇల్లు” పథకం నల్లేరు మీద నడకలాగే సాగుతుంది.. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇల్లు నిర్మిస్తామని చెప్పినా వల్ల వరకు ఎప్పుడు వస్తుందో తెలియక డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై చాలామంది నమ్మకం వదిలేశారు.. అలాంటి వారిని టార్గెట్ చేసి మీకు 100% డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇప్పించే బాధ్యత నాది అంటూ మోసాలకు పాల్పడ్డాడు ఓ ప్రబుద్దుడు. అందుకోసం ఏకంగా ఓ కంపినీని తెరిచి ప్రజల నుండి లక్షల్లో డబ్బులు వాసులు చేశాడు.

అసలు విషయానికి వస్తే..

దేశంలో ఎక్కడ లేని విధంగా డబుల్ బెడ్ రూమ్ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుంది. దాంతో ఇళ్ళు లేని నీరుపేదలు ఈ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం క్యూలు కడుతున్నారు. ఎలాగైనా సొంత ఇంటి కళ నెరవేర్చుకోవాలని ఆశగా ఎదురుచూస్తున్నారు. వీరి ఆశలే కొన్ని ముఠాలకు పెట్టుబడిగా మారాయి.

పటాన్ చెరువు కు చెందిన కిరణ్ కుమార్ హైదరాబాద్ సర్వే ఆఫ్ ఇండియాలో జనరల్ మ్యానేజర్ అంటూ ప్రచారం చేసుకున్నాడు. తమకు తెలిసిన కంపిని ద్వారా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇస్తుందని విస్తృతంగా ప్రచారం చేసాడు. ఇది నమ్మిన జనం అతని ఇంటి ముందు క్యూ కట్టారు. అంతా తన చేతుల మీద సాగుతుందని నమ్మించిన కిరణ్ కుమార్ డబుల్ బెడ్ రూమ్ కావాలంటే కొంత డబ్బు ముందుగానే చెల్లించాలంటూ డిమాండ్ చేసాడు.

అతడి మాటలను నమ్మి ప్రజలు వెనకా ముందు ఆలోచించకుండా కిరణ్ అడిగినంత డబ్బులు ఇచ్చారు. అలా వందల మంది నుండి లక్షల్లో వాసులు చేసి అందరిని మోసం చేసాడు కిరణ్. డబ్బులు కట్టిన వారికి ఎన్నిరోజులు అయిన డబుల్ బెడ్ రూమ్ ఇల్లు రాకపోవడంతో తాము మోసపోయామని తెలుసుకొని అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసారు. ప్రభుత్వ పథకాలకు ఎప్పుడు ఎక్కడ డబ్బులు వాసులు చేయరని, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం ఎవరిని ఆశ్రయించకూడదని ప్రభుత్వ అధికారులను సంప్రదించాలని చెపుతున్నప్పటికీ ప్రజలు మాత్రం ఇలాంటి ముఠాల చేతులో మోస మోతున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad