Home Latest News అవినీతి, కుమ్మ‌క్కు పోటీల్లో చంద్ర‌బాబుకు ఫస్ట్ ఫ్రైజ్: రోజా

అవినీతి, కుమ్మ‌క్కు పోటీల్లో చంద్ర‌బాబుకు ఫస్ట్ ఫ్రైజ్: రోజా

అవినీతి, కుమ్మ‌క్కు, ఊడిగం చేయ‌డం వాటిల్లో పోటీలు నిర్వ‌హిస్తే అందులో ఫ‌స్ట్ ఫ్రైజ్ ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకే వ‌స్తుంద‌ని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆర్‌కే రోజా అన్నారు. కాగా, ఇవాళ ఎమ్మెల్యే రోజా మీడియాతో మాట్లాడుతూ బీజేపీతో వైసీపీ రాజకీయ ఒప్పందం కుదుర్చుకుందంటూ టీడీపీ నేత‌లు చేస్తున్న వ్యాఖ్య‌లను ఖండించారు.

అంతేకాకుండా, కేంద్ర ప్ర‌భుత్వం ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌లేదు, బీజేపీపై యుద్ధం చేస్తానంటూ బీరాలు ప‌లికిన నీవు, నీతి అయోగ్ స‌మావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన త‌రువాత ప్ర‌ధాని మోడీకి వంగి వంగి దండాలు పెడుతూ తెలుగు ప్ర‌జ‌ల ప‌రువు తీశావ‌ని సీఎం చంద్ర‌బాబునుద్దేశించి రోజా అన్నారు.

కేంద్రంలో ఉన్న బీజేపీ ప్ర‌భుత్వానికి ఊడిగం చేస్తుంది నీవు, జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి కాదు, అందుకు సాక్ష్యం ఎన్టీఆర్ బ‌యోపిక్ చిత్ర షూటింగ్‌ ప్రారంభానికి ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు రావ‌డ‌మేన‌న్నారు. బాల‌కృష్ణ సినిమాకు వెంక‌య్య నాయుడు రాక‌నుబ‌ట్టి ఇట్టే తెలిసిపోతుంది బీజేపీ, తెలుగుదేశం కుమ్మ‌క్కయ్యాయ‌ని, ఆ విష‌యాన్ని ప్ర‌జ‌లు కూడా అర్థం చేసుకున్నార‌ని ఎమ్మెల్యే రోజా అన్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad