విశాఖపట్నం టీడీపీ ఎంపీ అభ్యర్ధి ఎంవీఎస్ భరత్‌ని ఓడించేందుకు ఏపీ మంత్రి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో కుట్రపన్నాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత దాడి వీరభద్రరావు ఆరోపించారు. కాగా, విశాఖలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. సమావేశంలో భాగంగా ఆయన మాట్లాడుతూ నారా లోకేష్ తనకు సమానంగా టీడీపీలో మరెవ్వరు ఉండకూడదని భావించాడని, ఆ క్రమంలో భరత్‌ను ఓడించమని విశాఖ టీడీపీ అగ్రనేతలకు ఫోన్లు చేసి మరీ చెప్పాడని దాడి వీర భద్రరావు తెలిపారు.
నాడు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ హయాంలో నారా చంద్రబాబు ఎలా అయితే తన తోడల్లుడైన దగ్గుబాటి వెంకటేశ్వరరావును మోసం చేశాడో.. అదే రీతిన నారా లోకేష్‌కూడా తన తోడల్లుడైన భరత్‌ను విశాఖ టీడీపీ అభ్యర్ధిగా ఓడించేందుకు సర్వశక్తులు ఒడ్డాడని దాడి వీరభద్రరావు చెప్పారు.
భరత్ ఓటమే లక్ష్యంగా కుట్రపన్నిన నారా లోకేష్ టీడీపీ ఓట్లను కూడా జనసేన ఎంపీ అభ్యర్ధి జేడీ లక్ష్మీనారాయణకు పడేలా చూడాలని విశాఖ టీడీపీ అగ్రనేతలకు నారా లోకేష్ సూచించారని దాడి వీర భద్రరావు వెల్లడించారు. ఇలా టీడీపీ మధ్య జరిగిన ఓట్ల చీలికలతో విశాఖ ఎంపీగా వైసీపీ అభ్యర్ధి సత్యానారాయన గెలుపొందడం ఖాయమని దాడి వీర భద్రరావు పేర్కొన్నారు.