Home Latest News చంద్ర‌బాబు నేల విడిచి సాము చేశారు..!

చంద్ర‌బాబు నేల విడిచి సాము చేశారు..!

టీడీపీ జాతీయ అధినేత చంద్ర‌బాబాబు నేల విడిచి సాము చేశారని, దాని ఫ‌లితంగానే ఆయ‌న్ను ముఖ్య‌మంత్రి పీఠం నుంచి ప్ర‌జ‌లు కిందకు దించారని సీపీఐ నేత నారాయ‌ణ అన్నారు. కాగా, ఈ రోజు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ప్ర‌జ‌ల్లోకి చొచ్చుకు వెళ్లారని, దాంతో ఆయ‌న్ను త‌మ నాయ‌కుడిగా ప్ర‌జ‌లు ఎన్నుకున్న‌ట్టు ఆయ‌న తెలిపారు.

తెలంగాణ రాజ‌కీయాల‌పై స్పందించిన నారాయ‌ణ సీఎం కేసీఆర్ అవ‌లంభిస్తున్న వైఖ‌రి కారణంగానే టీఆర్ఎస్ కొన్ని స్థానాల్లో ఓడిపోయింద‌ని, ఇక కాంగ్రెస్ ఓట‌మిపై మాట్లాడుతూ ఆ పార్టీ అధ్య‌క్షులు రాహుల్ గాంధీ అస‌మ‌ర్ధ నాయ‌క‌త్వ‌మే అందుకు ప్ర‌ధాన కార‌ణ‌మ‌న్నారు.

ఈ ద‌ఫా జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కమ్యూనిస్టు పార్టీలు కొన్ని త‌ప్పులు చేశాయ‌ని, ఆ కార‌ణంగానే ఒక‌ప్పుడు 60 స్థానాల్లో ఉన్న లెఫ్ట్ పార్టీలు.. ఇప్పుడు నాలుగు స్థానాల‌కే పరిమిత‌మ‌య్యాయ‌న్నారు. కుల‌, మ‌త‌, ధ‌న రాజ‌కీయాల‌తో లెఫ్ట్ పార్టీ పోటీప‌డ‌లేక పోయింద‌ని నారాయ‌ణ అన్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad