నేటి సమాజంలో ప్రేమంటే అర్దం తెలియని, కామంతో కళ్ళు మూసుకుపోయిన కొందరు కీచకులు వావీ వరసలు మరిచి ప్రవర్తిస్తున్నారు. సొంత సోదరి పైనే హత్యాచారాలు చేసే నీచులు కొందరైతే.. మరికొందరు మాత్రం ఏకంగా కూతురు పైనే ఆగయిత్యానికి పాల్పడుతున్నారు. ఇలాంటి వార్తలు రోజు వింటుంటే ఇలాంటి సమాజంలోనా మనం బ్రతుకుతుంది..? అని పిస్తుంది.
ఎన్ని చట్టాలు వచ్చినా, ఎంత పెద్ద శిక్షలు వేసిన కొందరు సైకోలు మాత్రం అస్సలు బయపడడం లేదు. ఈమాద్యే శంషాబాద్ చెందిన ఒక సైకో సొంత పెదనాన్న కూతురిపైనే కన్నెశాడు. నిన్ను నేను ప్రేమిస్తున్నాను.. నన్నే పెళ్లి చేసుకోవాలి.. లేదంటే చంపేస్తా అంటూ వేదిస్తున్నా ఒక సైకో చివరికి అన్నంత పనే చేశాడు. పెళ్ళికి ఒప్పుకోలేదని ఆ యువతి పైనే కాక ఆమె తల్లిపై కూడా కత్తితో దాడి చేశాడు.
వివరాల్లోకి వెళ్తే.. శంషాబాద్ లోని “వీకర్ సెక్షన్” కాలనీకి చెందిన “రమేశ్” (26) అనే వ్యక్తి సొంత పెద్దనాన్న కూతురైన 19 ఏళ్ల యువతిని ప్రేమిస్తున్నానంటూ గత 3 నెలలుగా వేధిస్తున్నాడు. అయితే అన్నయ్య వరసయ్యే “రమేశ్” అంత నీచంగా మాట్లాడడంతో తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లింది. దాంతో పెద్దలు రమేశ్ ని హెచ్చరించారు.
అయిన అతడిలో ఎలాంటి మార్పు రాలేదు. చివరికి నాకు దక్కేలా లేదు అని భావించిన ఆ సైకో ఆమెపై దాడికి దిగాడు. సోమవారం ఉదయం ఆ యువతి, తన తల్లితో కలిసి శంషాబాద్ లోని “ధర్మగిరి” ఆలయానికి వెళ్లింది. విషయం తెలుసుకున్న రమేశ్ కత్తితో అక్కడికి వెళ్ళి యువతి పైనే కాక ఆమె తల్లిపై కూడా దాడికి పాల్పడ్డాడు.