Home Latest News వైఎస్ జ‌గ‌న్‌పై తుల‌సీరెడ్డి ఫైర్‌..!

వైఎస్ జ‌గ‌న్‌పై తుల‌సీరెడ్డి ఫైర్‌..!

ఏపీ కాంగ్రెస్ నేత తుల‌సిరెడ్డి మ‌రోసారి ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌పై ధ్వ‌జ‌మెత్తారు. కాగా, ఇవాళ క‌డ‌ప‌లో మీడియా స‌మావేశం నిర్వ‌మించిన తుల‌సి రెడ్డి ఇటీవ‌ల జ‌గ‌న్ మోహన్‌రెడ్డి స‌మ‌ర శంఖారావం స‌భ‌లో ప్ర‌సంగించిన అంశాల‌పై ప్ర‌స్తావించారు. ముఖ్యంగా క‌డ‌ప ప్ర‌జ‌లు వైఎస్ ఫ్యామిలీకి ఎంతో చేశార‌న్న మాట‌ను త‌ప్పు బ‌ట్టారు.

వైఎస్ ఫ్యామిలీకి క‌డ‌ప‌కు మించి కాంగ్రెస్ పార్టీ సాయం చేసింద‌న్నారు. దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా నాలుగుసార్లు, అలాగే ఏపీ సీఎంగా రెండుసార్లు ఎన్నిక‌య్యేలా కాంగ్రెస్ స‌హ‌క‌రించ‌లేదా..? అని ప్ర‌శ్నించారు. జ‌గ‌న్ త‌న ప్ర‌సంగంలో కాంగ్రెస్‌ను మ‌రిచి, క‌డ‌ప‌ను మాత్ర‌మే ప్ర‌స్తావించ‌డం చ‌రిత్ర‌ను మ‌రువ‌డ‌మేన‌న్నారు. ఆఖ‌ర‌కు వైఎస్ జ‌గ‌న్ రాజ‌కీయ ప్ర‌వేశం కూడా కాంగ్రెస్‌తోనే జ‌రిగింద‌ని, 2009లో కాంగ్రెస్ కేటాయించిన ఎంపీ టికెట్‌పై గెలిచి పార్ల‌మెంట్‌లో అడుగు పెట్టార‌ని తుల‌సీరెడ్డి గుర్తు చేశారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad